ఈవారం విడుదల కాబోతున్న నాగార్జున ‘ఆఫీసర్’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్న జరిగింది. అక్కినేని కుటుంబం అంతా హాజరైన ఈ ఫంక్షన్ లో నాగచైతన్య తన తండ్రి నాగార్జున గురించి చేసిన కామెంట్స్ అందర్నీ ఆశ్చర్య పరిచాయి. 
నాగచైతన్య మాట్లాడుతూ..
రామ్ గోపాల్ వర్మ తీసిన ‘శివ’ విడుదలకు ముందు ఆమూవీ సూపర్ హిట్ అవుతుందని ఎవరూ ఊహించలేదని అదేవిధంగా ‘ఆఫీసర్’ కూడ ఊహించని ఘన విజయం సాధిస్తుంది అంటూ జోశ్యం చెప్పాడు చైతు. ఇదే సందర్భంలో ఈకార్యక్రమం నిర్వహిస్తున్న యాంకర్ నాగచైతన్యను తన తండ్రి గురించి చెప్పమని అడిగినప్పుడు వెంటనే తడుముకోకుండా నాగార్జున తనకు తండ్రి కాదు ఒక బ్రదర్ మాత్రమే అంటూ నవ్వుతూ జోక్ చేసాడు. 
నాన్న పోలీస్ ఆఫీసర్‌లాగే
ఈకార్యక్రమంలో పాల్గొన్న నాగ్ చిన్న కొడుకు అఖిల్ మాట్లాడుతూ 25ఏళ్ల క్రితం ‘శివ’ మూవీ కోసం తన తండ్రి నాగార్జున పడ్డ కష్టం కంటే ఆఫీసర్ సినిమా కోసం నాగ్ మరింత ఎనర్జీతో పనిచేసారు అని చెపుతూ ఈమూవీ పై అంచనాలు పెంచడానికి ప్రయత్నించాడు. ఈ మూవీ షూటింగ్ లో పాల్గొని తమ ఇంటికి వచ్చిన తన తండ్రి నాగార్జునను చూసినప్పుడు ఆయన క్రమశిక్షణ కష్టపడేతత్వం నిజంగానే పోలీస్ అధికారిని తనకు గుర్తుకు చేసాయి అంటూ నాగార్జున ఈసినిమా కోసం పడిన కష్టాన్ని వివరించడానికి ప్రయత్నించాడు అఖిల్.
అక్కినేని ఆత్మను పిలిచిన తనికెళ్ల భరణి
ఈవిషయాలు అన్నీ ఒక ఎత్తు అయితే ఈ మూవీ ఫంక్షన్ లో పాల్గొన్న తనికెళ్ళ భరణి మాట్లాడుతూ తన మాటల ద్వారా అక్కినేని నాగేశ్వరరావు ఆత్మను ఆహ్వానించడం కొసమెరుపు. తన కొడుకు ఉన్నతిని చూసి గొప్పగా ఆనంద పడ్డ అదృష్టం అక్కినేనికి దక్కింది అంటూ సంస్కార వంతమైన కుటుంబానికి చిరునామా అక్కినేని కుటుంబం అంటూ అక్కినేని కుటుంబాన్ని ఆకాశానికి ఎత్తేశాడు భరణి. ‘ఆఫీసర్’ మూవీ విడుదల తేది దగ్గర పడుతున్నా ఈమూవీ పై ఇంకా ఎటువంటి పాజిటివ్ టాక్ ఏర్పడని నేపధ్యంలో నిన్న అక్కినేని కుటుంబం అంతా కలిసి ఈమూవీకి హైక్ తీసుకు రావడానికి ప్రయత్నించిన ప్రయత్నాలకు ఎటువంటి విజయాన్ని ఇస్తుందో జూన్ 1న తేలిపోతుంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: