‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత సుకుమార్ పెద్దగా గ్యాప్ తీసుకోకుండా మహేష్ తో తాను తీయబోయే సినిమాకు సంబంధించిన కథను తయారు చేసే పనిలో ప్రస్తుతం బిజీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి సుకుమార్ మహేష్ ల మూవీ ఈ సంవత్సరం చివరిలో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నా తాను తీసే సినిమాల స్క్రిప్ట్ విషయంలో అనేక ఆలోచనలు చేసే సుకుమార్ ఇప్పటి నుంచే ఈమూవీ స్క్రిప్ట్ విషయమై తన రచయితల టీమ్ తో లోతైన చర్చలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
SUKUMAT ALONG WITH MAHESH LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ప్రస్తుతం బయటకు వస్తున్న లీకుల ప్రకారం ఈమూవీ ఒక క్రైం థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తీయబడుతోంది అని టాక్. ఈమూవీ కథలో మహేష్ సిఐడి ఆఫీసర్ గా కనిపిస్తాడట. సుకుమార్ చెప్పిన 2-3 స్టోరీలైన్స్ లో ఈకథకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈకథ పూర్తిగా సుకుమార్ ఇప్పటికీ పూర్తి చేయకపోవడంతో ఆకథలో మహేష్ లుక్  క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందనే విషయం పై మాత్రమే సుకుమార్ మహేష్ కు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 
DIRECTOR SUKUMAR LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
వాస్తవానికి సుకుమార్ తన హీరోలకు కథ చెప్పే ముందు ఆకథ కంటే కూడ ఆకథలో హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అన్న ఊహలలోకి సుకుమార్ తన హీరోని తీసుకుపోతాడు అని అంటారు.  గతంలో ‘రంగస్థలం’ విషయంలో కూడా సుకుమార్ ఈవిధంగానే చరణ్ కు ముందు కథ చెప్పకుండా కేవలం ఆపాత్ర క్యారెక్టర్ చెప్పి హీరో చెవిటివాడు అనే విషయాన్ని మాత్రమే ముందుగా చరణ్ కు చెప్పి ఒప్పించాడు అని అంటారు. ఇప్పుడు మహేష్ మూవీ విషయంలో కూడ అదే పద్దతిని సుకుమార్ అనుసరిస్తున్నట్లు సమాచారం. 
SPIDER MOVIE PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే గతంలో వచ్చిన ‘స్పైడర్’ సినిమాలో కూడ మహేష్ ఇలాంటి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా కనిపించాడు. అయితే ఆసినిమా సూపర్ ఫ్లాప్ మళ్ళీ అదే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా సుకుమార్ తరహాలో ఒక క్రైం థ్రిల్లర్ లో కనిపించడం యాదృశ్చికం కావడంతో పైకి చెప్పకపోయినా మహేష్ కు సుకుమార్ చెప్పిన కథ విన్న తరువాత ‘స్పైడర్’ అనుభవాలు గుర్తుకు వచ్చే ఉంటాయి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: