పా. రంజిత్ డైరక్షన్ లో కబాలి అంటూ టీజర్ తోనే సంచలనం సృష్టించిన రజినికాంత్ ఇప్పుడు అదే దర్శకుడితో కాలా అంటూ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాను వండర్ బార్ ఫిలింస్ ప్రొడక్షన్స్ లో రజినికాంత్ అల్లుడు ధనుష్ నిర్మించడం విశేషం. జూన్ 7న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది.

కరికాలన్ కాలాగా రజిని అదిరిపోయే లుక్ లో కనిపిస్తున్నాడు. నానా పటేకర్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాపై ట్రైలర్ అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా సినిమాలోని డైలాగ్స్ బాగా ఇంప్రెస్ చేశాయి. కాలా అంటూ ప్రేక్షకులను పలుకరించబోతున్న రజినికాంత్ ఈ సినిమాపై గట్టి నమ్మకంతో ఉన్నారు.

నిర్మాణ విలువలు కూడా బాగున్నట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. అయితే తెలుగు ట్రైలరే అయినా అరవ వాసన కనిపిస్తూనే ఉంది. మరి సినిమాలో బ్యాలెన్స్ చేశారో లేదో చూడాలి. ఓ పక్క రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్లాట్ ఫాం క్రియేట్ చేసుకుంటున్న రజినికి కాలా మూవీ బాగా సపోర్ట్ చేస్తుందని అంటున్నారు.

మేకింగ్ కూడా బాగుందనిపిస్తున్న ఈ సినిమాతో పా. రంజిత్ అద్భుతమైన విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి. అయితే కబాలికి వచ్చిన క్రేజ్ ను ఈ సినిమాకు తీసుకురావడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు. రజిని లుక్ విషయంలో కొత్తగా మార్పులేమి లేవు. ఇక ఆయన స్టైల్ కు ఎప్పుడు ఫ్యాన్స్ ఫిదా అవడం కామనే. మరి ఈ కాలా ప్రేక్షకుల మనసు గెలుస్తాడా లేడా అన్నది జూన్ 7న తెలుస్తుంది.
5/
5 -
(1 votes)
Add To Favourite