తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ (పడక సుఖం) విపరీతంగా జరుగుతుందని..ఇండస్ట్రీలో దళారులు బాగా పెరిగిపోయారని..అమ్మాయిలను చూస్తే చాలు పడక సుఖం అందించేందుకే ఉన్నాట్లుగా భావిస్తున్నారని అలాంటి వారి కోరల్లో ఎంతో మంది అమ్మాయిలు దారుణంగా బలి అవుతున్నారని నటి శ్రీరెడ్డి పోరాటం మొదలు పెట్టింది.  మొదట్లో కొన్ని చానల్స్ లో తన ఇంటర్వ్యూలు ఇస్తు వచ్చినా..ఫిలిమ్ ఛాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శన చేయడంతో ఈ అమ్మడికి ఒక్కసారే పాపులారిటీ పెరిగిపోయింది. దాంతో మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు శ్రీరెడ్డికి అండగా ఉండేందుకు ముందుకు వచ్చారు. 
Related image
తనకు మంచి సపోర్ట్ ఉందని భావించిన శ్రీరెడ్డి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్ ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. దాంతో సీన్ రివర్స్ అయ్యింది..ఒక్కసారే ఇచ్చిన సపోర్ట్ మొత్తం వెనక్కి తగ్గారు. ఇక మీడియా దగ్గరకు రానివ్వలేదు..దాంతో ఇంటికే పరిమితం అయిన శ్రీరెడ్డి ఇంట్లోనుంచే సోషల్ మాద్యమాల్లో తన కామెంట్స్ పెడుతూ వస్తుంది. తాజాగా జబర్ధస్త్ హైపర్ ఆదిపై సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. ‘హైపర్ ఆది.. మిమ్మిల్ని ఇంతక ముందు కలిశా.. మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. చాలా గౌరవం ఉంది. మంచి రైటర్ మీరు. అవకాశాలు లేక ఇబ్బందులు పడే వారికి ‘జబర్దస్త్’ షో చాలా ఉపయోగకరంగం ఉంది.
Image result for SRI REDDY PROTEST
మీరు వేషాల కోసం వచ్చే క్యారక్టర్ ఆర్టిస్ట్‌లకు అవకాశం ఇస్తున్నారు. ఇందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా.. అయితే మీరు మంది బుద్ది ఇలా తగలడుతుందని నేను ఊహించలేదు. అయితే ఇది మీ మీద ఎవరో ఒత్తిడి తెస్తే ఇలా పిచ్చి రాతలు రాస్తున్నారా? లేక మీరే స్వతాహాగా రాశారా అన్నది నా డౌట్. మహిళలల గౌరవానికి భంగం వాటిల్లితే నేను సహించను. జబర్దస్త్ షోని నిర్వహిస్తున్న మల్లెమాల, నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఇలాంటి వాటిని కంట్రోల్ చేయండి. ఇప్పటికే జబర్దస్ కామెడీ మీద చాలా నెగిటివ్ టాక్ ఉంది.
Image result for JABARDAST ADI
ఎవరైతే మహిళల కోసం పోరాడుతున్నారో వారికి గౌరవం ఇవ్వాల్సిన చోట అగౌరవ పరచడం తప్పు. పిచ్చి పంచ్‌లు వేసే ఆదికి.. వెర్రి నవ్వులు నవ్వే వాళ్లకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా.. నన్ను ఉద్దేశించి పెయిడ్ ఆర్టిస్ట్‌లు అంటూ జబర్దస్త్‌లో పంచ్‌లు వేశారు.కులం పేరుతో దూషించారని చితకొట్టారు మీ వాళ్లని. మీరు శృతి మించిన కామెడీ చేస్తే.. ఎవరో వచ్చి కొట్టేదాకా నేను వెయిట్ చేయను. నా చేతికి దురద ఎక్కువ.. అది అందరికీ తెలిసిందే. పిచ్చకొట్టుడు కొడతా.. హైపర్ ఆది గుర్తు పెట్టుకో అంటూ సిరియస్ వార్నింగ్ ఇచ్చింది శ్రీరెడ్డి. 


మరింత సమాచారం తెలుసుకోండి: