‘రంగస్థలం’ సూపర్ సక్సస్ తరువాత చరణ్ ఆలోచనలలో చాల మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చరణ్ బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న మూవీ తరువాత వెంటనే రాజమౌళి బందిఖానాలోకి వెళ్ళిపోతాడు. జక్కన్న సినిమా పూర్తి అయ్యేసరికి వచ్చే సంవత్సరం చివరకు వస్తుంది. 
RAMCHARAN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇలాంటి బిజీ షెడ్యూల్ లో కూడ చరణ్ తన సినిమాలకు సంబంధించి 2020 లో అనుసరించవలసిన వ్యూహాల గురించి తన పి ఆర్ టీమ్ తో ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు చరణ్ తన పి ఆర్ టీమ్ ను వివిధ భాషలోలో ఇప్పటి వరకు వచ్చిన పాత నవలలను చదివి అందులో తన భవిష్యత్ సినిమాల కథలకు పనికి వచ్చే నవలలను ఎంపిక చేయవలసిందిగా కోరినట్లు తెలుస్తోంది.  
RAMCHARAN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ప్రముఖమైన పాత నవలల్లో కథకు ప్రాముఖ్యత ఉండటమే కాకుండా ఆ నవలలలోని పాత్రలు సహజత్వానికి దగ్గరగా ఉండే నేపధ్యంలో అటువంటి ఒక విభిన్నమైన పాత్రలను ఎంచుకుని తన భవిష్యత్ సినిమాల ఎంపిక ఉండాలని చరణ్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమధ్య కాలంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కథకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలు ఘన విజయం సాధించిన నేపధ్యంలో చరణ్ ఆలోచనలలో ఈ మార్పులు వచ్చి పాత నవలల వైపు చరణ్ దృష్టి మళ్ళింది అనుకోవాలి. 
RAMCHARAN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనికితోడు ఈమధ్య ప్రముఖ దర్శకులుగా మారిన రచయితలు తీసిన చాల సినిమాల కథలు కాపీ అని వివాదాలు వస్తున్న నేపధ్యంలో చరణ్ తన సినిమాల కథలకు సంబంధించి కేవలం దర్శకుడు చెప్పే కథల పై ఆధారపడకుండా ఇలా తనంతట తానుగా కథల అన్వేషణ మొదలు పెట్టాడు అనుకోవాలి. ఏమైనా ‘రంగస్థలం’ ఘన విజయం చరణ్ ఆలోచనలలలో చాల మార్పులను తీసుకు వచ్చింది అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: