రాం గోపాల్ వర్మలోని టాలెంట్ ను గుర్తించి అసలు ఏమాత్రం ఆలోచించకుండా శివ సినిమా తీశాడు నాగార్జున. అప్పట్లో ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ మాత్రమే కాదు రొటీన్ గా వెళ్తున్న తెలుగు సినిమాలకు ఓ బెంచ్ మార్క్ గా అయ్యింది. ఇక ఆ తర్వాత మళ్లీ పాతికేళ్ల తర్వాత శివ కాంబినేషన్ లో సినిమా వచ్చింది. 


ఈసారి ఆఫీసర్ అంటూ ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథతో వస్తున్నాడు వర్మ. కింగ్ నాగార్జునను పోలీస్ గా చూపిస్తూ వర్మ చేయబోయే ఈ మ్యాజిక్ ఏమాత్రం వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. ఇక జూన్ 1న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ఈరోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. 


నాగార్జున పోలీస్ గా అదిరిపోయేలా చేశాడట. ఎలాంటి పాత్రనైనా సరే మెప్పించే నాగ్ ఈ సినిమాలో ఫుల్ యాక్షన్ హీరోగా కనిపిస్తాడట. ఇక హీరోయిన్ మైరా సరీన్ కూడా అందానికి అందం నటనకు నటన చూపించిందట. సినిమాలో చిన్న పాప కూడా బాగానే నటించిందట. ముంబై పోలీస్ అధికారి ప్రసన్నను చూసి స్పూర్తి పొంది వర్మ ఈ కథ రాసుకోవడం జరిగిందని అన్నాడు.


ఇక ఈ సినిమా సెన్సార్ నుండి యు/ఏ సర్టిఫికెట్ అందుకుంది. సెన్సార్ నుండి మంచి టాక్ సొంతం చేసుకున్న ఈ ఆఫీసర్ బాక్సాఫీస్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తాడో చూడాలి. జూన్ 1న మరో రెండు సినిమాలు కూడా రిలీజ్ అవుతుండటంతో ఆఫీసర్ ఏమాత్రం సత్తా చాటుతాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: