బుల్లితెరపై బోల్ బేబి బోల్ కార్యక్రమంతో సందడి చేస్తున్న సింగర్ హేమ చంద్ర అంటే తెలుగు ప్రేక్షకులు ఎంతగానో అభిమానిస్తారు.  చిన్నప్పటి నుంచి పాటలు పాడటం ఎంతో ఇష్టం అని..ఎన్నో స్టేజ్ షోల్లో పాటలు పాడానని...ఆ సమయంలో ఒక ఈవెంట్ మేనేజర్ కనిపించలేదు..ఆరా తీస్తే మాకు డబ్బులు ఎగ్గొట్టాలనే ప్రయత్నం చేశాడని తెలియడంతో చెంప చెల్లుమనిపించాను. కామారెడ్డిలో ఓ ఈవెంట్ చేయడానికి నా టీమ్ తో కలిసి వెళ్లాను.
Image result for SINGAR HEMA CHANDRA
షో అయిన తరువాత ఆ ఈవెంట్ లో మాతో పాడించిన వ్యక్తి కనిపించలేదు. అటూ ఇటూ చూస్తే..ఈవెంట్ నిర్వాహకులతో మాట్లాడుతూ కనిపించాడు. అయితే ఆ వ్యక్తి తమపై తప్పుడు ఆరోపణలు చేశాడు. అసలు విషయం ఏంటా అని తెలుసుకోవడానికి వెళ్లానని..ఆ సమయంలో మేము అతన్ని ఎక్స్ ట్రా అడుగుతున్నాడని నిర్వాహకులు నాకు చెప్పారు. 'మీ డబ్బులు రేపు ఇస్తాను వెళ్లిపోండి' అని ఆ వ్యక్తి నాతో అన్నాడు. 
Image result for SINGER HEMA CHANDRA
అయితే ఒప్పుకున్న అమౌంట్ ఎందుకు ఇవ్వరని నేను గట్టిగా నిలదీశానని...మాటా మాటా పెరగడంతో చెంప చెల్లుమనిపించానని అన్నారు. హైదరాబాద్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టించాను .. దాంతో ఆ వ్యక్తి డబ్బులు ఇచ్చాకే బయటికి వచ్చాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: