బాలీవుడ్లో విడాకుల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే హిమేష్ రేషమ్మియా, అర్జబ్ ఖాన్, హ్రితిక్ రోషన్ లు తమ తమ భార్యలకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో నటుడు తన భార్యకు విడాకులు ఇచ్చాడు. హీరో అర్జున్ రాంపాల్, మెహర్ జేసియా లు విడాకులు పొందినట్లు నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి విడాకుల వెనుక ఒక స్టార్ హీరో భార్యనే అని బి టౌన్ కోడై కూస్తుంది. ఇక ఆమె ఎవరో కాదు హ్రితిక్ రోషన్ భార్య సుసానే ఖాన్‌.

ఒకప్పుడు హ్రితిక్, సుసానే దంపతులు విడిపోవడానికి కూడా అర్జున్ రాంపాల్ కారణమని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అర్జున్ దంపతులు విడాకులు పొందటం ఆ వదంతులకు బలాన్ని చేకూరుస్తున్నాయి. హ్రితిక్ తో విడిపోయాక సుసానే ఒంటరితనాన్ని అనుభవించలేక ఆమె అర్జున్ తో సన్నిహితంగా మెలగడం వల్లనే మెహర్ విడాకులు కోరినట్లు సమాచారం.


అంతేగాక వీరి ఎఫైర్ కి బలం చేకూరేలా ఒక కార్యక్రమంలో సుసానే ని ఉద్దేశించి అర్జున్ సిగరెట్ లైన్ చెప్పడం అప్పట్లో యమ రూమర్లను సృష్టించింది. దీనితో పాటు సుసానే ని అర్జున్ పలుమార్లు రహస్యంగా కలుసుకోవడం తెలుసుకొనిన మెహర్ ఆయనతో పలుమార్లు గొడవకు దిగిందట. అలా చేయవద్దని చాలా సార్లు అర్జున్ తో చెప్పినా ఆయన వినకపోవడంతో ఆమె విషయాన్ని విడాకుల వరకు తీసుకొచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: