త్రివిక్రమ్ మాట అంటే హారిక హాసిని జనాలకు వేద వాక్కు. తనేం మాట్లాడితే అదే ఫైనల్ కానీ మారిన పరిణామాల నేపధ్యం లో ఒక విషయం లో మాత్రం త్రివిక్రమ్ మాట హారిక హాసిని వాళ్ళు వినడం లేదంటా..!  ఇంతకీ ఏంటంటే అరవింద సమేత వీర రాఘవ సినిమా ఓవర్ సీస్ హక్కులు ఎల్ ఎ తెలుగు సంస్థకు ఇవ్వడం త్రివిక్రమ్ కు అంతగా ఇష్టం లేదని తెలుస్తోంది.

Image result for trivikram

దీనికి కారణం మరేమీ కాదట. అజ్ఞాతవాసి సినిమాను ఓవర్ సీస్ లో ఎల్ ఎ తెలుగు సంస్థ కాస్త ఓవర్ గా రిలీజ్ చేసిందని, ఓవర్ గా పబ్లిసిటీ చేసిందని, ఓవర్ గా హైప్ చేసిందని అందువల్లే అక్కడ ఆ సినిమా ఫెయిలయిందని త్రివిక్రమ్ ఫీలవుతున్నారట. లేదూ అంటే ఓవర్ సీస్ లో తనకు భయంకరమైన మార్కెట్ వుందని, తన సినిమా అంటే మిలియన్లకు మిలియన్లు వసూలు చేస్తుందని, కానీ తగు మోతాదులో ప్రచారం, పద్దతిగా విడుదల చేయడం అన్నది చేయాలని, అక్కడే ఎల్ ఎ తెలుగు సరిగ్గా వ్యవహారించలేదని త్రివిక్రమ్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.

Image result for trivikram

అయితే ఎల్ ఎ తెలుగు సంస్థ బాగా సౌండ్ పార్టీ అని, ఆ సంస్థకు అమెరికాలో థియేటర్ల మీద మంచి పట్టు వుందని, వాళ్లు చేసినట్లు వేరేవాళ్లు చేయలేరని, పైగా అజ్ఞాతవాసి ఆబ్లిగేషన్ వుందని హారిక హాసిని జనాలు త్రివిక్రమ్ ను ఒప్పించినట్లు వినికిడి. ఇంతకీ అరవింద సమేత వీర రాఘవ సినిమా ఓవర్ సీస్ హక్కులు ఎంతకు విక్రయించారు? ఇదో పెద్ద చిక్కు ప్రశ్న. ముందుగా అరవింద సమేత, శైలజరెడ్డి అల్లుడు, శర్వా-సుధీర్ వర్మ సినిమాలు మూడు కలిపి 21కోట్లకు బేరం చెప్పారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అందులో చిన్న సినిమాల రెండింటి వాటా 5.5 కోట్లు అంట. అంటే ఎన్టీఆర్ సినిమా 15.5 కోట్లు అన్నమాట. 


మరింత సమాచారం తెలుసుకోండి: