ప్రపంచ వ్యాప్తంగా టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ కి ఎంతో ఆదరణ ఉంది.  భారత దేశంలో బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా బిగ్ బాస్ ఇప్పుడు 11వ సీజన్ నడుస్తుంది.  అయితే తెలుగు, తమిళ, కన్నడ బాషల్లో కూడా బిగ్ బాస్ రియాల్టీ షో ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.  ఇక బిగ్ బాస్ కి తెలుగు లో నందమూరి కుర్రోడు ఎన్టీఆర్ హోస్ట్ గా మొదటి సారి బుల్లితెరపై కనిపించాడు.  తమిళంలో విశ్వనటుడు కమల్ హాసన్, కన్నడంలో కిచ్చా సుదీప్ హోస్ట్ గా వ్యవహరించారు.  బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ పూర్తయిన తర్వాత సెకండ్ సీజన్ కి ఎవరు హోస్ట్ గా వస్తున్నారని తర్జన భర్జన అయ్యింది.
Image result for telugu bigg boss season 2
మొత్తానికి సెకండ్ సీజన్ లో నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్నట్లు డిసైడ్ అయిపోయింది.  ఇది పూర్తిగా సెలబ్రిటీ షో కావడంతో సాధారణంగానే దీనికి ఆదరణ ఎక్కువ. హౌస్‌లో ఉండే సెలబ్రిటీల మధ్య కోపతాపాలు, రకరకాల భావోద్వేగాలు, సరదా పనిష్మెంట్లు, ఆసక్తి కలిగించే టాస్క్‌లు.. వీటన్నిటితో షో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అందుకే ఈ షోకు ఆదరణ బాగా పెరిగింది. ‘బిగ్‌ బాస్’ సీజన్ 2 జూన్ 10 నుంచి మొదలవుతుందని స్టార్ మా ఛానెల్ ప్రకటించింది.
Image result for telugu bigg boss season 2
ఈ షో 100 రోజులపాటు వినోదాన్ని పంచనుంది. మొత్తం 16 మంది సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొనబోతున్నారు. ‘బిగ్‌బాస్ 2’కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న నాని కూడా ఈ మేరకు ట్వీట్ చేశాడు. ‘జూన్ 10.. 100 రోజులు.. 16 మంది సెలబ్రిటీలు.. ఒక బిగ్ హౌస్’ అంటూ తను ఈల వేస్తున్న ఫొటోతో నాని ట్వీట్ చేశాడు. ఈ షో స్టార్ మాలో ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు.. అలాగే సోమ, శుక్రవారాల్లో రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానుంది. అయితే ఇంత వరకూ షోకు ఎంపికైన సెలబ్రిటీల పేర్లు బయటపెట్టలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: