ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.  సినీ ప్రముఖులు వరుసగా కాలం చేయడం ఇండస్ట్రీని శోకసంద్రంలో ముంచేస్తుంది. తాజాగా బాలచందర్, మణిరత్నం వంటి పలువురు దర్శకులకు గురువుగా చిరపరిచితులైన ప్రముఖ తమిళ నిర్మాత ముక్తా శ్రీనివాసన్ (90) మంగళవారం రాత్రి మృతి చెందారు. ముక్తా ఫిలిమ్స్ పతాకంపై తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 67కు పైగా చిత్రాలను నిర్మించారు. 

Image result for star producer mukta srinivasan

ఆయన నిర్మించిన ‘నాయకన్’ చిత్రం భారత్ నుంచి తొలిసారి ఆస్కార్‌కు నామినేట్ అయి చరిత్ర సృష్టించింది. కమ్యూనిస్టు ఉద్యమనేతగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన తమిళ, తెలుగు, హిందీ బాషల్లో ముక్తా పిలిమ్స్ పతాకంపై 67 పైగా చిత్రాలను నిర్మించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రాత్రి పది గంటల సమయంలో స్వగృహంలోనే కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 

Image result for star producer mukta srinivasan

నటులు రజనీకాంత్, కమలహాసన్, దర్శకుడు మణిరత్నం తదితరులు ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన సినీ అనుభవమే 70 వసంతాలు. ఆ అనుభవంతో  ప్రఖ్యాత హీరోలు శివాజీగణేశన్, జెమినీగణేశన్, జైశంకర్, రజనీకాంత్, కమలహాసన్‌ల నుంచి ఈ తరం నటుల వరకూ పలు విజయవంతమైన చిత్రాలను రూపొందిన ఘనత ముక్తా శ్రీనివాసన్ సొంతం. 
ఆయన దర్శక నిర్మాతగా తెరకెక్కించిన చిత్రాలు.. ముదలాలి, నాలు వెలి నీలం, తామరైకుళం,ఓడి విళైయాడు పాపా, శ్రీరామజయం, నినైవిల్ నిండ్రవన్, అండమాన్ కాదలీ, సిమ్లా స్పెషల్ చిత్రాలు చెప్పవచ్చు. ఈయన నిర్మించిన నాయకన్ చిత్రం కమలహాసన్ సినీ జీవతంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: