అభిరుచిగల మంచి నిర్మాతగా పేరు సంపాదించిన దిల్ రాజ్ నిర్మిస్తున్న వరస సినిమాల లిస్టులో నిర్మింపబడుతున్న ‘శ్రీనివాస కళ్యాణం’ పై ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తోంది. ‘శతమానం భవతి’ లాంటి సూపర్ హిట్ సినిమాను అందించిన డైరక్టర్ సతీష్ వేగ్నిశ తో తీయబడుతున్న ఈమూవీ అవుట్ పుట్ పై దిల్ రాజ్ అసంతృప్తిగా ఉన్నాడని టాక్. 
సంబంధిత చిత్రం
ఈమూవీ కథ పరంగా బాగా ఉన్నా టేకింగ్ దగ్గరకు వచ్చేసరికి ఏవో లోపాలు జరిగాయి అన్న అభిప్రాయం దిల్ రాజ్ కు ఏర్పడటంతో ఆలోపాలను సరిదిద్దే పనిలో ప్రస్తుతం దిల్ రాజ్ బిజీగా ఉన్నట్లు టాక్. దీనితో ఈసినిమాలోని కొన్ని సీన్స్ ను రీషూట్ చేసినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. 
NITHIN SRINIVASA KALYANAM MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
‘శతమానం భవతి’ మూవీ కథ కుటుంబ సంబంధాల చుట్టూ తిరిగితే ‘శ్రీనివాస కళ్యాణం’ కథ మొత్తం మానవ సంబంధాల చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ఈమూవీలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రకాష్ రాజ్ మానవ సంబంధాలుకన్నా డబ్బే కీలకం అని భావించే పరిస్థుతులలో ఒక పెళ్ళికి వచ్చి ఎలాంటి అనుభవాలు ఎదుర్కున్నాడు ఎలా మారాడు అన్న పాయింట్ చుట్టూ కథ నడుస్తుందని సమాచారం. వాస్తవానికి ఈసినిమాలో చెప్పవలసిన పాయింట్ కంటే తెలుగింటి పెళ్లి పనులు షాపింగ్ లు పెళ్లి ఏర్పాట్లతో సినిమా చాల భాగం నిండిపోవడంతో అసలు కథ ఏమైంది అన్న సందేహం దిల్ రాజ్ కు వచ్చినట్లు టాక్. 
PRODUCER DIL RAJ LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనితో ఈసినిమా దర్శకుడుకి దిల్ రాజ్ క్లాస్ పీకినట్లు సమాచారం. తెలుస్తున్న సమాచారం మేరకు ‘శ్రీనివాస కళ్యాణం’ ‘శతమానం భవతికి’ సీక్వెల్ గా తయారైంది అన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వరస పరాజయాలతో సతమతమవుతున్న నితిన్ కు ఈమూవీ పై వస్తున్న వార్తలు టెన్షన్ పెడుతున్నట్లు తెలుస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: