మెగాస్టార్ చిరంజీవి హీరోగా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో ‘శంకర్ దాదా జిందాబాబ్’ చిత్రం తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ‘ప్రజారాజ్యం’ పార్టీ స్థాపించిన ప్రజంజనం సృష్టించాలని ప్రయత్నించారు. ఆ సమయంలో పార్టీ ప్రచారం కోసం తన కుటుంబ సభ్యులు అయిన రాంచరణ్, అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ లో అరసవల్లి నుంచి ప్రారంభం అయ్యింది.  ఇక తెలంగాణలో పవన్ కళ్యాన్ పార్టీ తరుపు నుంచి ప్రచారం చేశారు.  కానీ వీరి ప్రచారం ఏమాత్రం ప్రభావం చూపించలేక పోయింది. 

మొత్తానికి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు చిరంజీవి. ప్రస్తుతం అన్నబాటలో నడుస్తున్నారు పవన్ కళ్యాన్.  సార్వత్రక ఎన్నికల సమయంలో ‘జనసేన’ పార్టీ స్థాపించారు..కానీ పోటీ చేయలేదు.  వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పటిష్టం చేయడానికి సమాయత్తం అయ్యారు.  ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆ మద్య పర్యటన చేశారు. తర్వాత అనంతపూర్ పర్యటించారు. ఈ మద్య బాబాయ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలిస్తే ఆ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని సినీనటుడు రామ్ చరణ్ తేజ్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

తాజాగా పవన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయంపై స్పందించారు. ఎవరైనా స్వతహాగా వస్తే తన పార్టీలోకి ఆహ్వానిస్తానని, అంతేగానీ తన కుటుంబ సభ్యులను రమ్మని అడగబోనని అన్నారు. రాజకీయాల్లోకి రావాలంటే చాలా నిబద్ధత ఉండాలని, ఇష్టపడి రావాలని అన్నారు. తన కుటుంబ సభ్యులు సంతోషకరమైన జీవితం గడుపుతున్నారని, వారికెందుకు ఇబ్బంది? అని తాను అనుకుంటానని చెప్పారు. అంతకు మించి దీనిపై ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: