హాస్య బ్రహ్మ బ్రహ్మానందం పై ప్రేక్షకుల వ్ యామోహం (క్రేజ్) క్రమంగా పడిపోతూవస్తుంది. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమా ఏదైనా ఉంటే అందులో బ్రహ్మానందానికి ఖచ్చితంగా స్క్రీన్ స్పేస్ ఉండితీరాల్సిందె. వెండితెరపై కథానాయకులు కనిపిస్తే చాలు ప్రేక్షకులలో ఒక రకమైన ఉత్తేజం తో విజిల్స్ వేసేస్తారు. కాని ఒక్కోసారి హేరోలకు లేని క్రేజ్ బ్రహ్మానందానికి మాత్రం మాములుగా ఉండదు. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తంమారిపోయింది. ఆయనకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. సినిమాలు చేస్తున్నా అందులో చెప్పుకునే గుర్తుంచుకునే పాత్రపడడం లేదు.
Image result for nela ticket director kalyan krishna
ఒక జూనియర్ ఆర్టిస్ట్ కు ఇచ్చే స్క్రీన్-స్పేస్ కూడా బ్రహ్మానందంకు ఇవ్వడం లేదు. తాజాగా విడుదలైన "నేల టికెట్టు" సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ ఉందా లేదా అన్నట్లు మరీ చీప్ గా అంటే ఘోరాతి ఘోరంగా ఉందనే చెప్పాలి. రెండు, మూడు సీన్లలో మాత్రమే ఆయన ఉనికి కనిపించింది. ఇక డైలాగ్స్ అయితే ఆయన చెప్పి నట్లు కూడా గుర్తులేదు. దీని వెనుక ఒక వ్యూహాత్మక రివెంజ్ డ్రామా నడిచిందని చిత్రనగరి మాట. 
Image result for nela ticket director kalyan krishna
దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కావాలనే బ్రహ్మానందం పాత్రను ఇలా కుదించివేశాడని అంటున్నారు. కారణం గతంలో కళ్యాణ్ కృష్న దర్శకత్వం వహించిన ఆయన మొదటి సినిమా "సోగ్గాడే చిన్ని నాయనా" లో బ్రహ్మానందంకు "ఫుల్ లెంగ్త్ రోల్" ఇచ్చి హాస్యానికి పట్టభిషేకం చేశాడు. కళ్యాణ్ డెబ్యూ డైరెక్టర్ కావడంతో షూటింగ్ సమయంలో ఆయన్ని బ్రహ్మానందం బాగా డామినేట్ చేశారట. చెప్పిన సమయానికి షూటింగ్ కి రాకపోవడం, ఇచ్చిన డైలాగ్స్ తనకు నచ్చినట్లుగా చెప్పి, దర్శకునికి అసంతృప్తి కలిగించే పనులు చేశాడట. సీనియారిటీ కారణంగా కళ్యాణ్ కృష్ణ ఎదురునిలిచి మాట్లాడలేక పోయారట. 
Image result for nela ticket director kalyan krishna
అది మనసులో పెట్టుకున్న కల్యణ్ కృష్న బ్రహ్మానందంపై "పగ" తీర్చుకోవడానికే "నేల టికెట్టు" సినిమాలో బ్రహ్మానందానికి దారుణమైన పాత్ర సృష్టించి ఇచ్చారని అంటున్నారు. బ్రహ్మానందంపై  చిత్రీకరించిన దృశ్యాలను కూడా ఎడిటింగ్ డిలీట్ చేసి పారేశారట. ఎవరికి ఎవరిపై ఎన్ని కోపాలు ఉంటే ఏం లాభం? చివరికి ఆ ఎఫెక్ట్ సినిమా మీదే పడుతుంది కదా! నేల టికెట్టు సినిమా జావ్గారి పోయి అటు బ్రహ్మానందానికి, ఇటు కళ్యాణ్ కృష్ణకు చివరకు నిర్మాతలకు డిజాస్టర్ గా నిలిచిపోయింది.  

బ్రహ్మానందంపై రివెంజా?

మరింత సమాచారం తెలుసుకోండి: