మెగా పవర్ స్టార్ రాం చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమా రికార్డ్ వసూళ్లను మాత్రమే కాదు అంతకుమించి సంచలనాలే సృష్టించింది. నాన్ బాహుబలి రికార్డులలో 125 కోట్ల షేర్ తో బాహుబలి తర్వాత రంగస్థలం అరుదైన రికార్డ్ అందుకుంది. చిట్టిబాబుగా చరణ్ రచ్చ మెగా ఫ్యాన్స్ అందరిని ఖుషి చేసింది.


మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. డిఎస్పి మ్యూజిక్ కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిందని చెప్పాలి. రంగస్థలం టైటిల్ సాంగే కాదు ఆగట్టునుంటావా నాగన్న సాంగ్ కూడా మాస్ ఆడియెన్స్ ను ఉర్రూతలూగించింది. 


ఇక ఈ సినిమాలో పూజా హెగ్దె స్పెషల్ ఎట్రాక్షన్ జిగేల్ రాణి కూడా అదరగొట్టగా అన్నిటికన్నా రంగమ్మా మంగమ్మా సాంగ్ మాత్రం ప్రత్యేకమైన రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాలోని రంగమ్మా మంగమ్మా సాంగ్ యూట్యూబ్ లో సెన్సేషన్ అయ్యింది. ఏప్రిల్ 28న మొత్తం వీడియో సాంగ్ యూట్యూబ్ లో పెట్టగా నెల రోజుల్లో ఈ పాటని 42 లక్షల మంది చూడటం జరిగింది.


బాహుబలి-2 సాంగ్స్ తో పాటుగా ఫిదా సినిమాలోని వచ్చిందే సాంగ్ కూడా యూట్యూబ్ లో సూపర్ హిట్ అయ్యాయి. వాటి సరసన ఇప్పుడు రంగమ్మ మంగమ్మ సాంగ్ రికార్డ్ వ్యూయర్ కౌంట్ సాధించింది. దేవి మ్యూజిక్ సమంత క్యూట్ నెస్ ఈ పాటకు అందాన్ని తెచ్చాయ్. సినిమాలో కూడా ఈ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: