రాజోలు నుండి వచ్చిన అందాల భామ అంజలి హీరోయిన్ గా మొదట కోలీవుడ్ లో ప్రయత్నాలు మొదలుపెట్టి రెండు మూడు సినిమాలు చేసినా అమ్మడికి గుర్తింపు వచ్చింది మాత్రం తెలుగు సినిమాలతోనే. వెంకటేష్, మహేష్ నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అంజలి పాత్ర ఎప్పటికి గుర్తుంటుంది.


టాలీవుడ్ కోలీవుడ్ ఇలా రెండు భాషల్లో సినిమాలు చేస్తూ కాస్త కెరియర్ సెట్ అయ్యింది అనిపించుకున్న అంజలి మళ్లీ ఎందుకో వెనుకపడ్డది. ఇక ఈమధ్య కోలీవుడ్ హీరో జైతో ప్రేమలో ఉందని వార్తలు బాగా వచ్చాయి. వారిద్దరు తరచు కలవడం గిఫ్టులిచ్చుకోవడం తో ఈ వార్తలకు మరింత బలం వచ్చింది.


ఇక నేడో రేపో పెళ్లే అన్నట్టుగా బిల్డప్ ఇచ్చిన ఈ జంట ప్రస్తుతం ఎవరికి వారు ఎడమొహం పెడమొహం అన్నట్టు ప్రవర్తిస్తున్నారట. కొద్దిరోజులు కలిసి ఉన్నారన్నట్టుగా కోలీవుడ్ టాక్ కూడా ఉంది. మరి ఈ మధ్యలో ఏమైందో ఏమో కాని కోలీవుడ్ లో మరో ప్రేమాయణంకు ఎండ్ కార్డ్ పడ్డదని తెలుస్తుంది.


అందుకే అంజలి మళ్లీ సినిమాల మీద ఫోకస్ పెట్టాలని చూస్తుందట. కరెక్ట్ గా అంజలి దృష్టి పెట్టాలే కాని తెలుగులో ఆమె క్రేజ్ సంపాదించడం పెద్ద విషయమేమి కాదు మరి అంజలి, జై ల మ్యాటర్ నిజంగానే కటీఫ్ అయ్యిందా లేదా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: