ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోల నుంచి చిన్న స్థాయి హీరోల వరకు తమ పాత్రల పరంగా ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు.  కొంత మంది సక్సెస్ అవుతున్నా..కొంత మంది సక్సెస్ అందుకోలేకపోతున్నారు.  ఆ మద్య దర్శకులు మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’చిత్రంలో నాని మతిమరుపు పాత్రలో కనిపించాడు..ఈ సినిమా అనుకున్న స్థాయికి మించి సక్సెస్ అవుతుంది.  తర్వాత సకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’చిత్రంలో రాంచరణ్ చెవిటివాడి పాత్రలో నటించాడు..ఈ పాత్రకు రాంచరణ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 
Image result for bhale bhale magadivoy
ఆ మద్య నిఖిల్ నటించిన సూర్య వర్సెస్ సూర్య చిత్రంలో సూర్య రశ్మి తాకితే చనిపోయే ఒక వింత వ్యాధి లక్షణాలు కలిగిన పాత్రలో నటించాడు.ఈ చిత్రం కూడా మంచి సక్సెస్ అయ్యింది.  ‘నా పేరు సూర్య’ హీరోకు షార్ట్ టెంపర్ ఇలా చాలానే సినిమా వచ్చాయి. ఇక లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే ‘రాజుగాడు’లో రాజ్ తరుణ్ దొంగతనాలు చేసే బలహీనత, ‘అభిమన్యుడు’లో విశాల్ కు అతి కోపం ఇలా వరసబెట్టి ఇలాంటివే వస్తున్నాయి. 
Image result for rangasthalam movie
అయితే ఈ ఫార్ములా దర్శకుడు మారుతీ కనిపెట్టిన ఫార్ములా కాదు కమల్ హాసన్ సినిమాల్లో ఇటువంటి లోపాలు చాలానే చూశాం.  గతంలో కమల్ హాసన్ ఒక్కడే ఎన్నో ప్రయోగాత్మక పాత్రల్లో నటించాడు. ‘అమావాస్య చంద్రుడు’లో కళ్లు లేని వ్యక్తిగా, ‘స్వాతి ముత్యం’లో మానసికంగా ఎదుగుదల లేనివాడిగా, ‘విచిత్రసోదరులు’లో మరుగుజ్జుగా ఇలా చాలానే వేసాడు. అయితే వీటిలో కొన్ని హిట్ అయ్యాయి మరి కొన్ని ఫ్లాప్ అయ్యాయి. 
Related image
ఆ తర్వాత విక్రమ్ కూడా ఎన్నో ప్రయోగాత్మ చిత్రాల్లో నటించారు.  ‘శివపుత్రుడు’ చిత్రంలో మందబుద్దిగల వ్యక్తి పాత్రలో నటించి మెప్పించాడు. తర్వాత ‘ఐ’ చిత్రంలో కురూపిగా నటించాడు.  ఈమధ్య రాజ్ తరుణ్ ‘అందగాడు’ అనే సినిమాలో గుడ్డివాడిగా నటిస్తే సినిమా ఫ్లాప్ అయ్యింది. అయితే మళ్లీ రాజ్ తరుణ్ అదే ఫార్ములా ని యూజ్ చేసి ‘రాజుగాడు’ సినిమాతో మన ముందుకు రావడం గమనార్హం.
Related image
ఇక షూటింగ్ దశలో ఉన్న నాగ చైతన్య ‘సవ్యసాచి’లో హీరోకు తన కుడి చేయి ఆధీనంలో ఉండకపోవడం అనే వీక్ నెస్ ఉంటుంది. వెంకీ – వరుణ్ తేజ్ ల ఎఫ్2లో ఇద్దరికి ఒక్కో లోపం సెట్ చేసాడట దర్శకుడు అనిల్ రావిపూడి. మొత్తానికి మన హీరోలు లోపాలతో విజయాలు అందుకుంటూనే ఉన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: