ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల చిత్రాలు ఒకేసారి రిలీజ్ కావడమో..మరుసటి రోజు విడుదల కావడమో జరుగుతుంది.  అయితే పెద్ద హీరోల తో పాటు చిన్న హీరోల సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి.  కథా కధనం బాగుంటే..హిట్ టాక్ వస్తే..మంచి కలెక్షన్లతో దూసుకు వెళ్తున్నాయి.  అయితే ఎంతో పెద్ద హీరో అయినా కథా కథనం లో పట్టు లేకుకుంటే అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. 
Image result for vishal abibanudy
గత రెండు నెలల నుంచి స్టార్ హీరోలు అయిన రాంచరణ్ నటించిన ‘రంగస్థలం’, మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’,అల్లు అర్జున్ నటించిన ‘నా పేరు సూర్య’ వీటితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’ చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యింది. వరుసగా మూడు చిత్రాలు కలెక్షన్ల వర్షం కురిపించడంతో బయ్యర్లు సంతోషంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు అయితే అదే సమయంలో వచ్చిన మిగతా చిత్రాలు ప్లాప్ అయ్యాయి .
Image result for officer movie nagarjuna
తాజాగా మహానటి మంచి వసూళ్ల ని సాధిస్తోంది , ఆ సినిమాకు సరైన సినిమా ఏది పోటీ లేదు. ఇదిలా ఉంటే..ఈవారం జూన్ 1న విశాల్ హీరోగా నటించిన ” అభిమన్యుడు ” , రాజ్ తరుణ్ ” రాజుగాడు ” , కొత్త హీరో చిత్రం ” శరభ ” చిత్రాలతో పాటు కింగ్ నాగార్జున నటించిన ” ఆఫీసర్ ” చిత్రం విడుదల అవుతున్నాయి . అభిమన్యుడు తమిళంలో బ్లాక్ బస్టర్ అయ్యింది పైగా డిజిటల్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం కావడంతో ఆ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి .
Image result for raj tarun raju gadu
వర్మ దర్శకత్వంలో నాగార్జున నటించిన ఆఫీసర్ చిత్రంపై పెద్దగా అంచనాలు లేవు కాకపోతే నాగార్జున హీరో కాబట్టి ఓపెనింగ్స్ అయితే ఉంటాయి . ఇక రాజ్ తరుణ్ చిత్రం ‘రాజుగాడు’ చిత్రానికి ప్రమోషన్లే లేవు. అలాగే శరభ సినిమా పై కూడా . జూన్ 1న విడుదల అవుతున్న ఈ నాలుగు చిత్రాల్లో ఏది హిట్ అవుతుందో ? ఏవి ప్లాప్ అవుతాయో ? ఏ సినిమా విడుదల కాకుండా ఆగిపోతుందో చూడాలి .



మరింత సమాచారం తెలుసుకోండి: