తెలుగు, మళియాళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ వేదిక.  అయితే తెలుగు ఈ అమ్మడు నటించిన చిత్రాలు తక్కువే అయినా అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించింది. అర్జున్, జగపతి బాబు హీరోలుగా నటించిన తమిళ డబ్బింగ్ చిత్రం శివకాశి  ద్వారా తెలుగు తెరకు పరిచయమయింది. తర్వాత  ముని, విశయదశమి, బాణం, దగ్గరగా దూరంగా   చిత్రాలలో నటించింది. 
Image result for actress vedhika
ఆ తర్వాత తెలుగు లో నటించలేదు.  ఈ మద్య దక్షిణాది హీరోయిన్లు బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అక్క‌డ కూడా త‌మ స‌త్తాను చాటుకుంటున్నారు. తాజాగా వీరి బాట పట్టింది..వేదిక. ఇమ్రాన్ హష్మి హీరోగా రూపొందుతున్న మూవీలో హీరోయిన్ గా న‌టిస్తున్న‌ది.. ఈ చిత్రాన్ని మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేయనున్నాడు.
Image result for actress vedhika
సీనియ‌ర్ న‌టుడు రిషి కపూర్ కూడ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ‘ది బాడీ’ అనే టైటిల్ నిర్ణ‌యించారు.. వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్, సునీర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: