ఒక్క ఫ్లాప్ తో త్రివిక్రమ్ పెన్ను పవర్ తగ్గి పోవడమే కాకుండా ఆ సినిమా పక్కా కాపీ అని తేలిపోయింది. దీనితో త్రివిక్రమ్ మీద కాపీ అని ముద్ర పడిపోయింది ఇంతకు ముందు కూడా చాలా సినిమాలు కాపీ అని తెలిసిన పక్కా ఆధారాలు దొరకలేదు. కానీ అజ్ఞాతవాసి సినిమా విషయం లో అడ్డంగా బుక్ అయ్యాడు. అయితే తరువాత తాను చేయబోయే ఎన్టీఆర్ సినెమా కు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 

Image result for trivikram

అయితే ఎన్టీఆర్ సినిమా రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌నిజం బ్యాక్ డ్రాప్ లో క‌థ సాగుతోంది. ఆ ప్రాంతం భాష‌, యాస త్రివిక్ర‌మ్ తెలియ‌దు. ధైర్యం చేసి రాసిన ప‌ర్ పెక్ష‌న్ రాదు. అందుకే యాసపై మంచి ప‌ట్టున్న పెంచ‌ల్ దాస్ స‌హాకారం తీసుకుంటున్నట్లు వార్త‌లొచ్చాయి. పెంచ‌ల్ దాస్ అంటే రాయ‌ల‌సీమ క‌వి, ర‌చియిత‌, గాయ‌కుడు. ఈ విష‌యం లీక్ అవ్వ‌డంతో అస‌లు మ్యాట‌ర్ లీక్ చేసాడు త్రివిక్ర‌మ్.

Image result for trivikram

పెంచ‌ల్ త‌న సినిమాకు ప‌నిచేస్తున్న‌ట్లు ప‌బ్లిక్ గా ఒప్పుకున్నాడు. `కోబ‌లి` కోసం రాయ‌ల‌సీ ఫ్యాక్ష‌నిజాన్ని చాలా ప‌రిశోధ‌న చేసామ‌ని..అందులో కొంత భాగం అర‌వింద స‌మేత‌కు ఉప‌యోగా ప‌డుతుంద‌న్నారు. అలాగే సంభాష‌ణ‌లు ప‌దునైన‌విగా ఉండాలంటే ఆ భాషపై ప‌ట్టుండాలి. త‌న‌కి అంత పట్టు లేద‌ని భావించిన త్రివిక్ర‌మ్ పెంచ‌ల్ స‌హ‌కారం తీసుకుంటున్న‌ట్లు తెలిపాడు. మొత్తానికి త్రివిక్రమ్ ఎవరి క్రెడిట్ వారికి ఇవ్వడం అజ్ఞాతవాసి సినిమా వల్లన నేర్చుకున్నట్టున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: