తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ అంటే ఒక ట్రెండ్ అని చెప్పొచ్చు.  ఇండస్ట్రీలో యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు...సీఐడీ, క్రేమ్ చిత్రాలు ఎన్నో తీశారు. న్టీఆర్ .. ఏఎన్నార్ తరువాత స్థానంలో కృష్ణ కనిపిస్తారు. ఒక వైపున హీరోగానూ .. మరో వైపున నిర్మాతగాను ఆయన ప్రయోగాలు.. సాహసాలు చేశారు.   ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలకు తావు లేకుండా మంచి కెరీర్ కొనసాగించారు.  ప్రస్తుతం ఆయన వారసుడు ప్రిన్స్ మహేష్ బాబు స్టార్ హీరోగా హోదాలో ఉన్నారు. 
Related image
ఇక ఆయన అల్లుడు సుదీర్ బాబు మంచి ఫామ్ లోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ రోజు సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం. ఈ సందర్భంగా  'సమ్మోహనం' సినిమా టీమ్ కృష్ణని కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. 'సమ్మోహనం' రొమాంటిక్ ఎంటర్టైనర్ అని తెలుసుకున్న ఆయన, తన సినిమాల్లో 'పండంటి కాపురం'లో రొమాంటిక్ అంశాలు ఎక్కువగా కనిపిస్తాయని అన్నారు.

ఆ సినిమా 37 సెంటర్లలో 100 రోజులు ఆడిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదిలా ఉంటే ఈ మద్య బయోపిక్ చిత్రాలు ఎక్కవగా వస్తున్ననేపథ్యంలో హీరో కృష్ణ బయోపిక్ లో ఎవరు నటిస్తే బాగుంటుందని,  ఎవరు దర్శకత్వం వహిస్తే బాగుంటుంది? అని అడిగారు. ఎప్పుడో తీయబోయే సినిమా గురించి ఇప్పుడే ఎలా చెప్పగలను? అంటూ కృష్ణ నవ్వేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: