తెలుగు ఇండస్ట్రీలో కొన్ని చిత్రాలు టైటిల్స్ తోనే వాటి స్టామినా ఏంటో చూపిస్తాయి.  దర్శక, నిర్మాతలు, చిత్ర యూనిట్ ఎంతో తర్జన భర్జన చేసుకొని ఒక సినిమా టైటిల్ రిజిష్టర్ చేసుకుంటారు..అయితే ఆ కథ ఆ టైటిల్ కి సరిపోయే విధంగా ఉంటేనే చిత్రం సక్సెస్ అవుతుందని నమ్మకం.  ఇక తెలుగు ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్ బోయపాటి తన చిత్రాలకు సంబంధించి టైటిల్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.
Image result for jagadeka veerudu athiloka sundari
‘లెజెండ్’, ‘సరైనోడు’, ‘జయ జానకీ నాయక’ వంటి వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు డైరెక్టర్ బోయపాటి శ్రీను.  తాజాగా రంగస్థలం చిత్రంతో మంచి విజయం అందుకున్న రాంచరణ్, బోయపాటి కాంబినేష్ లో ఓ చిత్రం రాబోతుంది.  సినిమా అనుకున్నప్పటి నుంచే దీనిపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పక్కా మాస్ డైరెక్టర్, ఓ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో కలయికలో వస్తున్న ఈ సినిమా గురించి రోజుకో వార్త నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.

తాజాగా ఈ సినిమా గురించి బయటికి వచ్చిన ఓ ఆసక్తికర విషయం మెగా అభిమానులనులు సంతోషించే న్యూస్ ఒకటి ఫిలిమ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు చిరంజీవి సూపర్ హిట్ మూవీ టైటిల్‌లో మొదటి సగాన్ని పెట్టబోతున్నారట. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన జగదేకవీరుడు-అతిలోక సుందరి సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

సినిమా టైటిల్‌లోని మొదటి సగమైన ‘‘జగదేకవీరుడు’’ని ఈ సినిమా కోసం రిజిష్టర్ చేశారట. ఇదే కనుక నిజమైతే మెగా అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని పలువురు అభిప్రాయపడుతున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన ‘‘భరత్ అను నేను’’ ఫేం కియారా అద్వాణీ నటిస్తోంది. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: