హీరో విశాల్ కుటుంబ నేపధ్యం తెలుగు ప్రాంతం అయినా పుట్టింది పెరిగింది తమిళనాడు కావడంతో అందరు అతడిని కోలీవుడ్ హీరోగానే చూస్తారు. అయితే తెలుగు సినిమారంగంలో కూడ హీరోగా కమర్షియల్ గా రాణించాలని విశాల్ తాను నటించిన ప్రతి సినిమాను తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవ్వాలని తన శక్తిమేరకు ప్రయత్నిస్తున్నాడు. 
విశాల్ గారి పెళ్లి ఎప్పుడు
ఇలాంటి పరిస్థుతులలో ఈఏడాది సమ్మర్ రేస్ కు ముగింపు ఇస్తూ ఈరోజు విడుదల కాబోతున్న మూడు సినిమాలలో విశాల్ ‘అభిమన్యుడు’ కూడ ఉంది. ఈమూవీ ఇప్పటికే తమిళనాడులో సూపర్ హిట్ అయిన నేపధ్యంలో ఈమూవీ పై ఇక్కడ కూడ ఆశలు పెంచుకున్నాడు. విశాల్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్న ఈమూవీని ప్రమోట్ చేస్తూ నిన్న హైదరాబాద్ లో జరిగిన ఒక మీడియా సమావేశంలో సమంత విశాల్ మధ్య సరదా సంభాషణ చోటు చేసుకుంది. 
 నా పెళ్లి గురించి ఎందుకు
సమంత వివాహం జరిగాక ఎక్కువ విజయాలు సొంతం అవుతున్నాయని ఈమీడియా మీట్ ను నిర్వహించిన యాంకర్ ప్రస్తావించింది. దానికి సమంత సమాధానం ఇస్తూ ఇప్పుడు తన పెళ్లి గురించి ఎందుకు విశాల్ పెళ్లి గురించి మాట్లాడండి అంటూ జోక్ చేసింది. ఈమాటలకు వెంటనే రిప్లయ్ ఇచ్చిన విశాల్ అప్పుడే తనకు పెళ్లి ఏమిటి తన వయస్సు 28 సంవత్సరాలు మాత్రమే అంటూ జోక్ చేసింది. దానికి సమంత రివర్స్ జోక్ వేస్తూ విశాల్ తన వయస్సు మర్చిపోయాడు. అతడి అసలు వయస్సు 26 మాత్రమే అంటూ రివర్స్ పంచ్ వేసింది. 
HERO VISHAL ALONG WITH SAMANTHA AT ABHIMANYUDU MOVIE MERIA MEET FUNCTION PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే వాస్తవానికి విశాల్ వయస్సు 40 సంవత్సరాలు కావడంతో ఆమీడియా సమావేశానికి వచ్చినవారంతా ఈ ఫన్నీ జోక్ ను తెగ ఎంజాయ్ చేసారు.  సైబర్ వార్ నేపధ్యంలో తీయబడిన ‘అభిమన్యుడు’ ఒక థ్రిల్లర్ మూవీ. తెలుగులో డైరెక్ట్ గా ఒక భారీ సినిమాను చేయాలి అని ఆశ పడుతున్న విశాల్ కలలకు ఈ ‘అభిమన్యుడు’ సక్సస్ విశాల్ కు చాల కీలకం. ఈమూవీతో పోటీగా విడుదల అవుతున్న నాగార్జున ‘ఆఫీసర్’ కు  రాజ్ తరుణ్ ‘రాజుగాడు’ కి పెద్ద అంచనాలు లేని నేపధ్యంలో ఈడబ్బింగ్ సినిమాను తెలుగు ప్రజలు ఏవిధంగా ఆదరిస్తారో చూడాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: