‘భరత్ అనే నేను’ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న  సినిమాలో కూడ కొంత సామాజిక స్పహ ఉండే కథాంశం ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈసినిమా కథ కొంత బాగం అమెరికాలో మరికొంత భాగం ఇండియాలో నడిచే నేపధ్యంలో మహేష్ కృష్ణుడు తరహా పాత్రలో అల్లరి నరేశ్ కుచేలుడి తరహా పాత్రలో కనిపిస్తారు అన్న వార్తలు ఇప్పటికే వచ్చాయి. 
MAHESH ALONG WITH VAMSI PAIDI PALLY LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీలో రైతుల సమస్యల ప్రస్తావన ఉంటుందని తెలుస్తోంది. వంశీ పైడిపల్లి రైతులు పడుతున్న కష్టాలు అదేవిధంగా రైతు ఆత్మహత్యలు ఈమూవీలో చాల పవర్ ఫుల్ గా చూపించే విధంగా స్క్రిప్ట్ తయారు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈమూవీ స్క్రిప్ట్ ఏడాది క్రితం పూర్తి అయింది. 
PRODUCER DIL RAJ LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రైతులకు అనుకూలంగా అనేక నిర్ణయాలు తీసుకున్న నేపధ్యంలో రైతు సమస్యలను ఎక్స్ పోజ్ చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టె డైలాగులు పెడితే అది తెలంగాణ ప్రభుత్వానికి అసహనంగా మారుతుందని ఈమూవీని నిర్మిస్తున్న దిల్ రాజ్ భయపడుతున్నట్లు టాక్. దీనితో ఈమూవీ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయమని దిల్ రాజ్ వంశీ పైడిపల్లి పై ఒత్తిడి చేస్తున్నట్లు గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. 
MAHESH LATEST PHOTOS IN NHARATH ANE NENU కోసం చిత్ర ఫలితం
ఈమూవీలో మహేష్ లుక్ చాల డిఫరెంట్ గా ఒక లవర్ బాయ్ ఇమేజ్ ఉండే విధంగా చూపించడానికి వంశీ పైడిపల్లి మహేష్ హెయిర్ స్టైల్ ను చాల డిఫరెంట్ గా చూపించడానికి దేశంలోని కొందరు ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ల సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రభాస్ గతంలో నటించిన ‘డార్లింగ్’ మూవీలో క్యూట్ లవర్ బాయ్ గెటప్ లో కనిపించినట్లుగా 44 ఏళ్ల మహేష్ ను డిఫరెంట్ స్టైల్ లో చూపించే ప్రయత్నంలో అనేకమంది స్టైలిస్ట్ లతో వంశీ పైడిపల్లి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: