‘మహానటి’ మూవీ విడుదలై మూడు వారాలు దాటిపోయినా ఇంకా ఆమూవీ మ్యానియా తగ్గకపోవడంతో సావిత్రి జీవితం గురించి ఆమె జీవితంలో బయటకు రాని విషాయల గురించి ఇంకా అనేక ఆసక్తికర వార్తలు మీడియాలో హడావిడి చేస్తూనే ఉన్నాయి. ఇలాంటి నేపధ్యంలో ప్రముఖ హాస్య నటి రమాప్రభ ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సావిత్రి వ్యక్తిగత జీవితం పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. 
ACTRESS SAVITHRI PHOTOS కోసం చిత్ర ఫలితం
సావిత్రిని మోసం చేసింది ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ సావిత్రిని ఎవరూ మోసం చేయలేదని తనకు తానే మోస పోయింది అని సాకింగ్ కామెంట్స్ చేసింది రమాప్రభ. సావిత్రి చివరి రోజులలో ఆమెను జెమినీ గణేషన్ మొదటి భార్య కూతురు హాస్పటల్ లో ఉంచిన విషయం తనకు తెలుసు అని అంటూ మరొక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది రమాప్రభ. 
ACTRESS SAVITHRI PHOTOS కోసం చిత్ర ఫలితం
సావిత్రికి మద్యాన్ని అలవాటు చేసింది ఎవరూ కాదని తనకు తానే మద్యానికి బానిసగా సావిత్రి మారింది అన్న విషయాన్ని బయట పెట్టింది. ఇదే సందర్భంలో సావిత్రి తన రేష్ డ్రైవింగ్ తో కారు యాక్సిడెంట్ చేసిన విషయాన్ని రమాప్రభ బయటపెడుతూ ‘మహానటి’ మూవీలో చూపెట్టిన విధంగా ఆమె కార్ల రేస్ లో బహుమతులు అందుకోలేదు అన్న విషయాలను గుర్తుకు చేసుకుంది ఒకనాటి ఈహాస్య నటి. 
ACTRESS SAVITHRI PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇది ఇలా ఉండగా సావిత్రి పెదనాన్న చౌదరి మనవరాలుని అంటూ ఒక మహిళ విడుదల చేసిన ఆడియో టేప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. సావిత్రి చివరి రోజుల్లో ఆమె కుమార్తె విజయ చాముండేశ్వరి ఎలా ప్రవర్తించిందో అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది అని అంటూ సావిత్రి బ్రతికి ఉన్నపుడు విజయ చాముండేశ్వరి, ఆమె హస్బెండ్ వాళ్ల బంధువులు సావిత్రి ఇంటి కోసం ఆమెపై కోర్టు కేసులు వేసి ఇంటి నుండి తరిమేశారు అన్న విషయాన్ని బయటపెట్టింది. తన తల్లి సావిత్రి గురించి గుర్తుకు చేసుకుంటూ ఎమోషనల్ గా మాట్లాడటం చూస్తుంటే తనకు ఆశ్చర్యం కలిగిస్తోంది అంటూ మీడియా ముందు తల్లిని గుర్తుకుచేసుకుంటూ ఎడ్వవద్దు అంటూ సావిత్రి కూతురుకు సలహాలు ఇస్తోంది చౌదరి మనవరాలు. ఏమైనా సావిత్రి జీవితం ఆమెకు ఆర్ధికంగా ఏరకంగాను కలిసిరాకపోయినా ఆమె బయోపిక్ అశ్వినీదత్ కు కోట్లు కురిపిస్తూ అతడిని ఆన్ని విధాల ఆడుకుంటోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: