ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన నాగార్జున ‘ఆఫీసర్’మూవీకి సంబంధించి అమెరికాలోని ప్రీమియర్ షోల టాక్ బయటకు వచ్చింది. అనూహ్యంగా ఈసినిమా పై అంచనాలు లేని నేపధ్యంలో దీనికి భిన్నంగా ఈమూవీని చూసిన ఓవర్సీస్ ప్రేక్షకులు ఈమూవీని ప్రశంసిస్తూ చేస్తున్న కామెంట్స్ ను చూసిన వారు చాలామంది ఆశ్చర్యపోతున్నారు. నాగార్జున అభిమానులుగా ఈసినిమాను చూసి ఆనంద పడ్డాము అని కొందరు బెస్ట్ సౌండ్ ఎక్స్  పీరియన్స్  కోసం ఈమూవీని తప్పకుండా చూడండి అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. 
Nagarjuna’s ‘Officer’ movie
మరి కొంతమంది అయితే నాగ్ వర్మల కాంబినేషన్ మళ్ళీ నిరూపించుకుంది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికితోడు ‘ఆఫీసర్’ అంచనాలను అందుకుంది అంటూ నాగార్జున అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. అదేవిధంగా ఈసినిమాకు ఓవర్సీస్ లో మంచి టాక్ రావడం ఖాయం అన్న అభిప్రాయాన్ని కూడ మరికొంతమంది ఓవర్సీస్ ప్రేక్షకులు వ్యక్త పరుస్తున్నారు. 
NAGARJUNA OFFICER MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనితో నెగిటివ్ టాక్ వస్తుంది అనుకున్న ఈమూవీకి ఈ అనుకోని పాజిటివ్ టాక్ ఏమిటి అని చాలామంది ఆశ్చర్య పోతున్నారు. ఆఫీసర్ మూవీని ఎక్కడా ఎవరికీ అమ్మకపోయినా ఈమూవీని మన తెలుగు రాష్ట్రాలలో 400కు పైగా దియేటర్లలో విడుదల చేయడం ఆశ్చర్య కరంగా మారింది. ఈమూవీ పై నాగార్జున పెద్దగా ఆశలు పెట్టుకోకపోయినా ఈమూవీ ప్రచారంలో చాల యాక్టివ్ గా పాల్గొన్నాడు. 
NAGARJUNA OFFICER MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే ఈమూవీ విషయంలో అన్నపూర్ణ స్టూడియో టీమ్ ఏమాత్రం జోక్యం చేసుకోకపోయినా పట్టువదలని విక్రమార్కుడులా వర్మ ఈమూవీకి అత్యధిక ధియేటర్లు దొరికేలా ప్లాన్ చేసుకోవడమే కాకుండా ఈమూవీకి సంబంధించి ప్రముఖ ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇస్తూ వర్మ చాల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే బయటకు వచ్చిన ఓవర్సీస్ టాక్ సపోర్ట్ తో మన తెలుగు రాష్ట్రాలలో కూడ ఈమూవీకి కనీసపు యావరేజ్ టాక్ వచ్చినా తిరిగి వర్మ హవా ప్రారంభం కావడం ఖాయం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: