ఈ మద్య బుల్లితెరపై బిగ్ బాస్ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు.  హాలీవుడ్ లో మొదలైన బిగ్ బాస్ ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కూడా వస్తుంది. తెలుగు లో మొదటి సారిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.  తమిళంలో కమల్ హాసన్, కన్నడంలో కిచ్చ సుదీప్ లు వ్యాఖ్యాతలుగా ఉన్నారు.  తెలుగు లో ఫస్ట్ సీజన్ పూర్తయ్యింది..ఇందులో శివబాలాజి విన్నర్ గా నిలిచారు.  ప్రస్తుతం రెండవ సీజన్ ప్రారంభం అయ్యింది..కాకపోతే ఎన్టీఆర్ కి బదులుగా నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. 

తాజాగా బిగ్ బాస్ 2 లో 16 మంది సభ్యులు పాల్గొనబోతున్నారని..వారి లీస్ట్ ఇదే అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.  ఇందులో హీరో తరుణ్ కూడా ఉన్నాడు.  గత కొంత కాలంగా హీరో తరుణ్ కి సినీ అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి..దాంతో బిగ్ బాస్ లో మనోడు పాల్గొంటాడని వార్తలకు గట్టి బలం వచ్చింది.  కానీ అలాంటి వారికి తరుణ్ షాక్ ఇచ్చాడు.

అసలు తాను బిగ్ బాస్‌లో పాల్గొనడంలేదని వివరణ ఇచ్చాడు. తను బిగ్ బోస్ షోలో చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. నిజానికి బిగ్ షోలో పాల్గొనడానికి తనకు ఇంటెన్షన్ కానీ, ఇంట్రెస్ట్ కానీ లేదని తేల్చి చెప్పారు. కాబట్టి ఇప్పటి వరకు వైరల్ అవుతోన్న ఆ 16 మంది సెలబ్రిటీ కంటిస్టెంట్ల జాబితాలో  తరుణ్ లేడని తేలిపోయింది.
Image result for big boss 2 telugu
ఈ సీజన్‌ను నేచురల్ స్టార్ ఎలా నడిపించబోతాడో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాని కూడా మాటకారి, అంతకు మించి చమత్కారి కాబట్టి కచ్చితంగా హోస్టింగ్ బాగుంటుందని భావిస్తున్నారు. జూన్ 10 నుంచి స్టార్ మాలో ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు, సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు షో ప్రారంభమవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: