తెలుగు ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి.  అయితే జక్కన్న ఎక్కవగా ఎన్టీఆర్ తో చిత్రాలు తీశారు.  దర్శకుడిగా తన కెరీర్ మొదలు పెట్టిందే ఎన్టీఆర్ తో అని  చెప్పొచ్చు. ‘స్టూడెంట్ నెం.1’ ఎన్టీఆర్, రాజమౌళికి మొదటి చిత్రం.  ఆ తర్వాత సింహాద్రి, యమదొంగ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చాయి.

ఇక రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన రెండవ చిత్రం ‘మగధీర’మరో అద్భుతమైన విజయం సాధించారు. త్వరలో రాజమౌళి దర్శకత్వంలో ఒక భారీ మల్టీ స్టారర్ రూపొందనుంది.  ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. అక్టోబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ఆరంభించనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమాలో చరణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడనే టాక్ వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ఇద్దరూ సోదరులే అయినప్పటికీ వాళ్లు ఎంచుకున్న మార్గాలు వేరు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి. భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మించే ఈ సినిమా కోసం త్వరలోనే కథానాయికలను ఎంపిక చేయనున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: