తెలుగు ఇండస్ట్రీలో ఉయ్యాల జంపాల చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ తర్వాత వచ్చిన చిత్రాలు వరుసగా విజయం సాధించాయి.  దాంతో రాజ్ తరుణ్ చిన్న నిర్మాతల పాలిట వరంగా మారారు.  మినిమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రాజ్ తరుణ్ తాజాగా నటించిన ‘రాజుగాడు’ చిత్రం ఈ రోజు రిలీజ్ అయ్యింది.   అయితే తెలుగు ఇండస్ట్రీలో చాలా కొద్ది మంది మాత్రమే మహిళా దర్శకులు ఉన్నారన్న విషయం తెలిసిందే.  అలాంటివారి జాబితాలో తాజాగా సంజనా రెడ్డి కూడా చేరిపోయారు.
Image result for rajugadu movies
రాజ్ తరుణ్ హీరోగా ఆమె రూపొందించిన 'రాజుగాడు' ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. ఈ సందర్భంగా ఆమె తనకి సినిమాల పట్ల ఆసక్తి ఏర్పడటానికి గల కారణాన్ని వివరించారు. వేసవి సెలవుల్లో తన బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో పవన్ కళ్యాన్, భూమిక నటించిన ‘ఖుషి’ చిత్రం రిలీజ్ అయ్యింది.  నెల రోజుల పాటు విశాఖలో వున్న నేను ఆ సినిమాను 27 సార్లు చూశాను. 'ఖుషీ' సినిమాలోని ప్రతీ సీన్ .. పవన్ కల్యాణ్ నటన నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. 
Image result for rajugadu movies
దాంతో సినిమా ఇండస్ట్రీపై విపరీతమైన ఆకర్షన పెరిగిపోయింది..తాను కూడా ఓ మంచి లవ్ స్టోరీ తీయాలన్న కోరిక కలిగిందని అన్నారు. ఆ తరువాత నేను జర్నలిస్ట్ ను కావడంతో సినిమా ప్రపంచంతో మంచి పరిచయం ఏర్పడింది. వర్మ 'రౌడీ' సినిమాకి అసిస్టెంట్ గా పనిచేయడం .. అమల అక్కినేనితో చేసిన యాడ్ ఫిల్మ్ కి మంచి పేరు రావడంతో దర్శకత్వం వైపు అడుగులువేశాను" అని చెప్పుకొచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: