ఈమధ్య కాలంలో టాప్ హీరోలందరితో సినిమాలు తీస్తూ టాప్ ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగిన డివివి దానయ్య రాజమౌళి త్వరలో ప్రారంబించబోతున్న భారీ మల్టీ స్టారర్ ‘ఆర్ ఆర్ ఆర్’ తో నేషనల్ సెలెబ్రెటీ ప్రొడ్యూసర్ గా మారబోతున్నాడు. వాస్తవానికి ‘బాహుబలి’ తరువాత రాజమౌళితో సినిమాలు తీయాలని ఎన్నో ప్రముఖ నిర్మాణ సంస్థలు ప్రయత్నించినా గతంలో రాజమౌళి దానయ్యకు ఒక సినిమా తీసి ఇస్తాను అని పుచ్చుకున్న అడ్వాన్స్ వల్ల రాజమౌళి దానయ్యకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండవలసి వచ్చింది అన్న వార్తలు ఎప్పోదో వచ్చాయి. 
SS Rajamouli RRR Movie Title Poster HD
ఇలాంటి పరిస్థుతులలో ఈసంవత్సరం అక్టోబర్ నుండి ప్రారంభం కాబోతున్న ఈభారీ మల్టీ స్టారర్ విషయంలో దానయ్యను తప్పించి మరో ప్రముఖ నిర్మాత రంగంలోకి దిగడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో గత కొన్ని రోజులుగా గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. ఆసక్తికరమైన ఈ షాకింగ్ గాసిప్పుల వివరాలలోకి వెళితే ఒక ప్రముఖ నిర్మాత దానయ్యతో నడుపుతున్న రాయబారాలకు సంబంధించిన వార్తలు ఇప్పుడు టాపిక్ ఆఫ్ డి టాలీవుడ్ గా మారాయి.
Inside Talk: #RRR Producer Asked To Give Up Project?
ఈ ప్రతిష్టాత్మకమైన భారీ ప్రాజెక్ట్ నుండి దానయ్య తప్పుకుని నిర్మాణ బాధ్యతలు తనకు అప్పచెపితే దానయ్యకు గుడ్ విల్ గా 50 కోట్ల భారీ మొత్తాన్ని ఇస్తానని ఒక షాకింగ్ డీల్ దానయ్య వద్ద పెట్టినట్లు టాక్. అంతేకాదు సుమారు 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిమ్పబడుతున్న ఈమూవీ నిర్మాణం పూర్తి అయి బిజినెస్ పూర్తి చేసుకునే సరికి దానయ్యకు ఈ 50 కోట్ల స్థాయిలోనే లాభాలు ఉంటాయని ఆ బడా ప్రొడ్యూసర్ దానయ్యకు వివరంగా వివరించినట్లు తెలుస్తోంది.
SS Rajamouli with Jr NTR and Ram Charan Teja.
అయితే ఈవార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా ఇప్పుడు హడావిడి చేస్తున్న ఈ గాసిప్ మాత్రం ఎవరో కావాలని దానయ్యను ఆట పట్టించడానికి ఇలా ప్రచారంలోకి తీసుకు వచ్చారా ? లేదంటే ఇటువంటి ఆఫర్ నిజంగానే దానయ్యకు ఆఫర్ చేయడం జరిగిందా అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కనీసం ప్రారంభోత్సవ పూజ కూడ జరగని ఈ భారీ మల్టీ స్టారర్ పై వస్తున్న ఇలాంటి వార్తలు ఈమూవీ పట్ల బయ్యర్లలో క్రేజ్ ను మరింత పెంచే ఆస్కారం ఉంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: