తెలుగు ఇండస్ట్రీలో అలనాటి అందాల తార మహానటి సావిత్రి జీవితకథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఈ చిత్రంలో సావిత్రి పాత్ర పోషించిన కీర్తి సురేష్ కి ఎక్కడ లేని పేరు వచ్చింది.  అంతే కాదు ఈ చిత్రంలో అందరు పెద్ద నటులే ఉండటంతో చిత్రం మరో హైలెట్ గా నిలిచింది.  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మహానటి' సినిమా విశేషమైన ఆదరణ పొందుతోన్న నేపథ్యంలో సావిత్రితో తమకి గల అనుబంధాన్ని చాలామంది మీడియాతో పంచుకుంటూ వస్తున్నారు.
Related image
తాజాగా సావిత్రి ఫ్యామిలీతో తమకి గల అనుబంధాన్ని గురించి మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి ప్రస్తావించారు.  సావిత్రి మంచి నటిగా ఉన్న సమయంలో ఆమెకు మా అమ్మతో ఎంతో సాన్నిహిత్యం ఉండేది. ఆ కారణం తోనే అమ్మతో కలిసి నేను చిన్నతనంలో సావిత్రి ఇంటికి వెళ్లే వాడిని..ఆ సమయంలో ఆమె వైభోగం చూసి ఆశ్చర్యపోయేవాడిని. అడిగినవారికి లేదనకుండా సావిత్రి దానధర్మాలు చేసేవారు.తన ఇంట్లోని పనివాళ్లు మోసం చేస్తున్నారని తెలిసి కూడా ఆమె పెద్దగా పట్టించుకునేవారు కాదు.
Image result for mahanati
చెన్నై .. హైదరాబాద్ .. విజయవాడ .. కొడై కెనాల్ లో కలిపి ఆమెకి చాలా ఖరీదైన 7 బంగ్లాలు ఉండేవి. అప్పట్లో సావిత్రి బంగ్లాలు అంటే ఎంతో గొప్పగా చెప్పుకునే వారు. అలాంటి బంగ్లాలన్నిటినీ ఆమె కోల్పోయారు. ఆమె నుంచి సాయాన్ని పొందినవారెవరూ ఆ తరువాత ఆమెను పలకరించలేదు. అయితే చివరిదశలో కూడా అందరూ చెప్పుకుంటున్నంతగా ఆమె ఆర్థికంగా చితికిపోలేదు. సావిత్రి కొడుకు .. కూతురు ఇద్దరూ కూడా ఇప్పుడు మంచి పొజీషన్లలో వున్నారు" అని చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: