స్టార్ మా ప్రయోగాత్మకంగా చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ హిందిలో సూపర్ సక్సెస్ అవగా తెలుగులో మొదటి సీజన్ కూడా ఎన్.టి.ఆర్ హోస్టింగ్ టాలెంట్ తో ఎలాగోలా నెట్టుకొచ్చాడు. తారక్ వచ్చే శని, ఆదివారాలు మాత్రం టి.ఆర్.పి రేటింగ్స్ లో టాపులేచిపోయేది. బిగ్ బాస్ వన్ లో కంటెస్టంట్స్ గా పేరుమోసిన సెలబ్రిటీస్ ను ఎంపిక చేయలేదు.


ముందు ట్రైల్ ఎపిసోడ్ లాగా అన్నట్టుగా బిగ్ బాస్ సీజన్ 1 ముగిసింది. అక్కడ కంటెస్టంట్స్ కన్నా హోస్ట్ కే ఎక్కువ క్రేజ్ వచ్చింది. ఇక ఇప్పుడు సెకండ్ సీజన్ కు రెడీ అవుతున్న బిగ్ బాస్ లో మొదటి సీజన్ లా చిన్న సెలబ్రిటీస్ కాదు చాలా పెద్ద వారినే దించుతున్నారట. అందులో ఒకప్పటి హీరోయిన్స్ కూడా ఉన్నారట.


అంతేకాదు నందమూరి హీరో తారకరత్న కూడా బిగ్ బాస్ సీజన్ 2లో పాటిస్పేట్ చేస్తున్నారని తెలుస్తుంది. నందమూరి ఫ్యామిలీ నుండి వచ్చి హీరోగా ఎదగలేకపోయిన తారకరత్న ఈమధ్య విలన్ గా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తారకరత్న బిగ్ బాస్ హౌజ్ లో ఎలా సందడి చేస్తాడో చూడాలి.


తారకరత్నతో పాటుగా మీడియా సర్కిల్స్ లో మరికొందరి సెలబ్రిటీస్ పేర్లు వినపడుతున్నాయి. అయితే అది ఫైనల్ లిస్టా కాదా అన్నది మాత్రం జూన్ 10న మాత్రమే తెలుస్తుంది. నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా ఈ బిగ్ బాస్ సీజన్ 2 ఎలా ఉండబోతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: