దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సవ్యసాచి’ ఒక డిఫరెంట్ జోనర్ మూవీ. ఈమూవీలో హీరోగా నటిస్తున్న నాగచైతన్య పాత్రకు ఒక విచిత్రమైన మేనరిజమ్ ఉంటుంది. అతడి చేయి అతడికి తెలియకుండానే నేరాలు చేస్తూ ఉంటుంది. ఒక మానసిక సంఘర్షణ చుట్టూ తిరిగే ఈమూవీని చందు మొండేటి చాల డిఫరెంట్ గా తీస్తున్నాడు అన్న టాక్ ఉంది. 
Savyasachi teaser will out soon
అయితే ఈమూవీకి ఊహించని సమస్యలు ఎదురౌతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చైతన్య సినిమాల మార్కెట్ చిన్నది అయిన నేపధ్యంలో అతడి సినిమాల పై నిర్మాతల పెట్టుబడి 20 కోట్ల లోపు అయితేనే సేఫ్ లో ఉంటారు అన్న కామెంట్స్ ఉన్నాయి. చైతూ మాస్ హీరోగా మారాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అతడి ప్రయత్నాలు ఏమాత్రం సక్సస్ ను అందుకోలేకపోయాయి. 
సవ్యసాచి వివరాలు తెలిపిన చైతు
ఈ నేపధ్యంలో చైతన్య సినిమాల కలక్షన్స్ 25 కోట్ల పరిధిని దాటడం చాల కష్టంగా మారింది. ఈ అక్కినేని యంగ్ హీరో ఈమధ్య నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ ‘యుద్ధం శరణం’ లాంటి చిత్రాలకి ఫెయిల్యూర్ టాక్ రావడంతో ఆ మూవీల పై పెట్టిన పెట్టుబడిలో సగం కూడ రాలేదు అన్న వార్తలు ఉన్నాయి. 
naga
ఇలాంటి పరిస్థుతులలో ప్రస్తుతం చైతు నటిస్తున్న 'సవ్యసాచి' చిత్రానికి బడ్జెట్‌ అనుకున్నదాని కంటే చాలా ఎక్కువ అయింది అన్న వార్తలు హడవిడి చేస్తున్నాయి. ఇంకా నిర్మాణ దశలోనే వున్న ఈ చిత్రానికి ఖర్చు అప్పుడే ముప్పయ్‌ అయిదు కోట్లు దాటి పోయింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈమూవీ పూర్తి అయ్యేసరికి నలభై కోట్లు టచ్‌ అయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీ నిర్మాతలు ఏమి చూసుకుని చైతన్య పై ఇంత సాహసం చేస్తున్నారు అన్న కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: