బిగ్ బాస్-2 మొదలవడానికి ఇంకా 8 రోజులే ఉంది. ఈసారి నాచురల్ స్టార్ హోస్ట్ గా వస్తున్న ఈ సీజన్ మరింత మజా ఇస్తుందని చెబుతున్నారు. 100 రోజులు.. 16 మంది కంటెస్టంట్స్ ఉండే బిగ్ బాస్ హౌజ్ లో ఒక ఆడియెన్ కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇస్తున్నారు. జూన్ 10న మొదలవనున్న ఈ షోలో కంటెస్టంట్స్ ఎవరు అన్నది తెలియాల్సి ఉంది.


సోషల్ మీడియాలో రోజుకో లిస్ట్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పైటిలానే శని ఆదివారాల్లో 9 గంటల నుండి మొదలయ్యే ఈ షో సోమవారం నుండి శుక్రవారం వరకు 9 గంటల 30 నిమిషాల నుండి మొదలవుతుంది. మొదటి సీజన్ వీకెండ్స్ లో మాత్రం అందరు బిగ్ బాస్ చూసేవారు.


ఎన్.టి.ఆర్ తన హోస్టింగ్ టాలెంట్ తో అందరిని మెప్పించాడు. ఇక ఇప్పుడు నాని వంతు వచ్చింది. ఎన్.టి.ఆర్ తర్వాత చేస్తున్నాడు కాబట్టి నాని మీద కొద్దిపాటి ప్రెజర్ ఉండటం కామనే. మరి అది ఎలా చేజ్ చేస్తాడో చూడాలి. ఇక లేటెస్ట్ గా బిగ్ బాస్-2 కొత్త ప్రోమో వదిలారు.


ఈ ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక్కోరకం.. స్నేహితులు, ప్రేమికులు, నవ్వించేవాళ్లు, కవ్వించేవాళ్లు, మిలమిలా మెరిసేవాళ్లు, మినిమమ్‌గా బతికేసేవాళ్లు, ఎదురెళ్లి పోరాడేవాళ్లు, ఎలాగోలా లాగించేసేవాళ్లు, సున్నితమైన వాళ్లు, మహా ముదుర్లు, ఎవరికేం కావాలో, ఎవరేం కావాలో డిసైడ్ చేసేది మాత్రం అంటూ ప్రోమోలో నాని అదిరిపోయేలా చేప్పాడు. కచ్చితంగా నాని తనకు ఇచ్చిన ఈ బాధ్యతను సక్సెస్ ఫుల్ గా చేస్తాడని ఆశిస్తున్నారు అభిమానులు. 



మరింత సమాచారం తెలుసుకోండి: