ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వివాదం ఉంది అంటూ ఇండస్ట్రీలోని చీకటి కోణాల్ని బయటపెట్టి ఇండస్ట్రీ బండారం  బట్టబయలు చేసింది శ్రీరెడ్డి. ఆమె ఇదంతా కేవలం పాపులారిటీ కోసమే నానా రాచ్చ చేస్తుందన్న వారి విమర్శల నోటికి తాళం పడేలా ప్రముఖుల బండారాలను ఫోటో ప్రూఫుల రూపంలో బయటపెట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది.


ఉద్యమం ఉధృతమవుతున్న సమయంలో పవన్ కల్యాణ్ ను దూషించడం వల్ల నీరుగారిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుండి బయట పెద్దగా కనిపించని ఆమె సామాజికమాధ్యమాల నుండే తాను అనుకున్నవి చెప్పేస్తూ సంచలనాకు తెరలేపుతుంది. తాజాగా ఇండస్ట్రీలోని ప్రముఖ కుటుంబంపై ఫేసుబుక్లో పోస్టు చేసి మరో బాంబు పేల్చింది.


మెగా కుటుంబం గురించి ఫేసుబుక్లో రాసుకొస్తూ- " మెగా ఫ్యామిలీలో ఒకతను నాకు బాగా క్లోజ్‌. అతను చెప్పాడు ప్రజారాజ్యం అప్పుడు అవకతవకలు బాబోయ్‌. ఆ సంగతి తెలిస్తే ప్రతి ఒక్కరు వామ్మో అంటారు. టైం వచ్చినపుడు రివీల్‌ చేస్తా" అని తెలిపింది. మరి అతనితో ఏమైనా సన్నిహితంగా దిగిన ఫోటోలు ఉన్నాయా అని మెగా అభిమానుల్లో ఆందోళన మొదలైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: