తెలుగు ఇండస్ట్రీలో మినిమం గ్యారెంటీ హీరోల్లో ఒకరు నిఖిల్.   హ్యాపీ డేస్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ ఈ మద్య వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు.  అయితే నిఖిల్ కి మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం ‘కార్తికేయ’. చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా కొంతకాలం క్రితం వచ్చిన 'కార్తికేయ' ఘన విజయాన్ని అందుకుంది.
Image result for karthikeya movie
సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.  అప్పట్లో ఈ చిత్రానికి సీక్వెల్ ఉండబోతుందని వార్తలు వచ్చినా..లైన్ లోకి మాత్రం రాలేదు.  తాజాగా కార్తికేయ సిక్వెల్ తీయడానికి సిద్దం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే..ఈ సినిమాకి నిర్మాత దొరికాడనేది తాజా సమాచారం.
Image result for chandu mondeti nikhil
ఏసియన్ సునీల్ నిర్మాణ రంగంలోకి వస్తున్నారు. 'కార్తికేయ 2' ను నిర్మించడానికి ఆయన ముందుకు రావడంతో, చందూ మొండేటి .. నిఖిల్ ఖుషీ అవుతున్నారు. వీరిద్దరూ ఆల్రెడీ కమిట్ అయిన ప్రాజెక్టులను పూర్తిచేసి, ఈ సీక్వెల్ ను పట్టాలెక్కించనున్నారు. ఈ ప్రాజెక్టు తరువాత శేఖర్ కమ్ముల .. నాని కాంబినేషన్లో ఏసియన్ సునీల్ ఓ సినిమా చేయనున్నాడని సమాచారం.      



మరింత సమాచారం తెలుసుకోండి: