ఈ మద్య సెన్సేషన్ క్రియేట్ చేసే ప్రతి విషయంలోనూ బెట్టింగ్స్ జరుగుతున్నాయి. గతంలో ఎక్కువ శాతం క్రికెట్ లోనే బెట్టింగ్స్ జరిగేవి రాను రాను ప్రతి విషయంలోనూ బెట్టింగ్ లక్షల్లో కాస్తున్నారు.  పాలిటిక్స్ లో కూడా విపరీతంగా బెట్టింగ్స్ జరుగుతున్నాయి.  సినిమా హిట్ అవుతుందని, లేదా ఫ్లాప్ అవుతుందని కూడా బెట్టింగ్స్ కడుతున్న రోజులువి.  ఈ మద్య జరిగిన ఐపిఎల్ మ్యాచ్ లలో వేల కొట్లల్లో బెట్టింగ్స్ అయినట్లు సమాచారం.   ఇటీవల జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో బెట్టింగ్ స్కామ్‌ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
Image result for ipl betting arbaj khan
ఈ కేసులో విచారణకు హాజరు కావాలని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్‌కు మహారాష్ట్రలోని థానే పోలీసులు సమన్లు జారీ చేయగా, ఆయన హాజరయ్యాడు. తాను బెట్టింగ్‌కు పాల్పడినట్లు అంగీకరించాడు. అయితే బెట్టింగ్ వల్ల తాను ఎంతో నష్టపోయానని ఒకదశలో ఏం చేయాలో తెలియని అయోమయ స్థితికి చేరుకున్నానని అర్భాజ్ అన్నారు. బెట్టింగ్‌ బుకీ సోనుకి తనకు గత ఆరేళ్ల నుంచి పరిచయం ఉందని అర్బాన్‌ ఖాన్‌ ఒప్పుకున్నట్లు తెలిసింది.
Image result for ipl betting arbaj khan
సోనుతో ఆయన చేసిన చాటింగ్‌, ఇతర బుకీలతో కలిసి వీరిద్దరు దిగిన ఫోటోలు పోలీసులకు లభ్యమయ్యాయి. అలాగే, గతేడాది తాను ఐపీఎల్‌ మ్యాచ్‌లో బెట్టింగ్‌ పెట్టి రూ.2.75 కోట్లు నష్టపోయానని అర్బాన్‌ అంగీకరించాడు.  ఈ మద్య పోలీసులు జరిపిన విచారణలో సోను అనే బుకి అర్భాజ్ ఖాన్ పేరు ని బయట పెట్టడంతో కథ మొత్తం బయటకు వచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: