ఈ మద్య బుల్లితెరపై జబర్ధస్త్ కామెడీ షో ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే.  జబర్ధస్త్ లో నటించిన వారికి  వెండితెరపై కూడా మంచి చాన్సులు వస్తున్నాయి. ఒకదశలో తెలుగు ఇండస్ట్రీలో చాలా వరకు జబర్ధస్త్ కామెడీ షో నుంచి వచ్చినవారే అని చెప్పొచ్చు.  ప్రస్తుతం జబర్దస్త్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది హైపర్ ఆది.  మనోడు వేసే పంచులు మొదటి నుంచి చివరి దాకా కడుపుబ్బా నవ్వి పోవాల్సిందే. 
Image result for hyper adhi
కాకపోతే అప్పడప్పడు మాత్రం కొన్ని కాంట్రవర్సీలకు గురి అవుతున్నాయి.  హైపర్ ఆది బుల్లితెరపైనే కాదు వెండి తెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.  ఆ మద్య అల్లరి నరేష్ తో మేడమీద అబ్బాయి చిత్రంలో నటించాడు.  తర్వాత వరుణ్ తేజ్ నటించిన ‘తొలిప్రేమ’ లో కనిపించాడు.  ప్రస్తుతం హైపర్ అది ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ ఆటగదరా శివ.
Image result for hyper adhi
‘ఆ నలుగురు, మధుమాసం, అందరి బంధువయా’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు చంద్ర సిద్దార్థ ఈ మూవీకి డైరెక్ట్ చేయడం విశేషం.  ‘భజరంగీ భాయీజాన్, లింగ’ వంటి సినిమాల్ని నిర్మించిన నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఈ మూవీ తో హైపర్ ఆది కి ఎంత కలిసొస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: