‘బాహుబలి’ భళ్ళాలదేవుడు పాత్రతో నేషనల్  సెలిబ్రిటీగా మారిపోయిన రానా ఆరోగ్యం పై వస్తున్న వార్తలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో హాట్ న్యూస్ గా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు రానా ఒక క్లిష్టమైన కంటి సర్జరీ చేయించుకునేందుకు విదేశాలకు వెళ్ళబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 త్వరలోనే విదేశాలకు
రానా కుడి కంటిలో తలెత్తిన తీవ్ర సమస్య వల్ల రానాకు సర్జరీ అవసరమని డాక్టర్లు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనితో రానా తన కంటి శస్త్ర చికిత్య నిమిత్తం విదేశాలకు వెళ్ళ బోతున్నట్లు ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక షాకింగ్ న్యూస్ ప్రచురించింది. రానాకు చిన్నప్పటి నుంచే ఒక కంటిలో చూపులేదనే విషయం మంచు లక్ష్మి నిర్వహించే ఒక టాక్ షోలో రానా స్వయంగా చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. 
పలు భాషల్లో రానా దగ్గుబాటి
రానాకు జరగబోతున్న ఈ సర్జరీ చాల క్లిష్టమైంది కాబట్టి ఈవిషయంలో కొంత గోప్యత పాటించాలని దగ్గుబాటి ఫ్యామిలీ భావిస్తున్నట్లు టాక్. ‘బాహుబలి’ తరువాత ఏర్పడ్డ ఇమేజ్ తో రానా ప్రస్తుతం అనేక భాషల సినిమాలలో నటిస్తూ చాల బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం రానా హిందీలో నటిస్తున్న ‘హాథీ మేరే సాథీ’ మలయాళంలో నటిస్తున్న ‘మరట్వాడ వర్మ కింగ్ ఆఫ్ ట్రావంకోర్’ అనే చిత్రాల షూటింగ్ చివరకు రావడంతో ఈమూవీలకు సంబంధించిన వర్క్ ను పూర్తి చేసుకుని రానా తన సర్జరీ చేయించుకునే ఆస్కారం ఉంది అని అంటున్నారు. 

తనపై ఒకరు జాలి చూపించడం తనకు నచ్చదని అందుకే తన కంటి సమస్య గురించి తాను ఎవ్వరితోను చెప్పుకోను అని రానా మంచులక్ష్మి టాక్ షోలో చెప్పాడు. దీనితో రానా మాటలకు అప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. రానాకు జరగబోతున్న ఈ కంటి శస్త్ర చికిత్స విజయవంతం అయి తిరిగి రానా సినిమాలలో బిజీ అవ్వాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: