తెలుగు బుల్లి తెరపై హాట్ యాంకర్ గా అనసూయ జోరు కొనసాగిస్తుంది.  బుల్లితెరపైనే కాదు వెండి తెరపై కూడా తన సత్తా చాటుతుంది.  ఈ మద్య సుకుమార్, రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా మంచి పేరు తెచ్చుకుంది. దాంతో ఈ అమ్మడికి వరుసగా ఛాన్సులు వస్తున్నాయి.  ఓ వైపు జబర్ధస్త్ కామెడిషో లో యాంకర్ గా చేస్తూనే ఇతర ఛానల్స్ లో యాంకర్ గా కొనసాగుతుంది.
Image result for anasuya beach
 సోషల్ మాద్యమాల్లో కూడా యాక్టీవ్ గా ఉంటుంది అనసూయ.  తాజాగా ఈ అమ్మడు కుటుంబంతో కలిసి మాల్దీవుల్లో ఓ బీచ్ లో సేద తీరుతుంది. ప్రముఖ యాంకర్, సినీ నటి అనసూయ పెళ్లిరోజు నేడు.

ఈ సందర్భంగా తన భర్త భరద్వాజ్ తో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది రంగమ్మత్త. ఈ సందర్భంగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. ఎప్పట్లాగానే తన భర్త ఈ ఏడాది కూడా సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడని తెలిపింది. ఈ ఏడాది మాల్దీవ్స్ కు వచ్చామని పేర్కొంది. ఇంతకంటే ఎక్కువ ప్రేమను పొందగలమా అంటూ ట్వీట్ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: