నాగార్జున కెరియర్ లో టాప్ డిజాస్టర్ గా పేరు తెచ్చుకున్న ‘ఆఫీసర్’ మూవీగురించి ప్రేక్షకులు మీడియా ఏమానుకున్నా ఈమూవీని దర్శకత్వం వహిస్తూ నిర్మించిన రామ్ గోపాల్ వర్మకు ఊహించని లాభాలు తెచ్చిపెట్టాయి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఇప్పుడు ఒకహాట్ న్యూస్ హడావిడి చేస్తోంది. గతకొంత కాలంగా వర్మ తీస్తున్న సినిమాలు అన్నీ ఘోరంగా ఫ్లాప్ అవుతూ ఉన్నా చివరకు వర్మకు మాత్రం లాభాలను తెచ్చి పెడుతున్నాయని ఇండస్ట్రీ వర్గాలలోని కొందరి వాదన. ఈగాసిప్పులకు కొనసాగింపుగా లేటెస్ట్ గా విడుదలైన ‘ఆఫీసర్’ మూవీ ద్వారా వర్మ 10కోట్ల లాభం కళ్ళ చూసాడని ప్రస్తుతం గుసగుసలు హడావిడి చేస్తున్నాయి. 
Nagarjuna will be seen as a cop in a new film with Ram Gopal Varma.
ఆఫీసర్ సినిమాను ఆంధ్ర, సీడెడ్, నైజాంలకు కలిపి సుమారు ఆరుకోట్ల మేరకు బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇదికాక శాటిలైట్ డిజిటల్ ద్వారా 12కోట్ల వరకు వచ్చిందని అంటున్నారు. వాస్తవంగా నాగార్జునకున్న మార్కెట్ రీత్యా 5కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్న పరిస్థుతులలో వర్మ నాగార్జునకు తన రకరకాల బాధలుచెప్పి కేవలం ఒప్పుకున్న పారితోషికంలో సగంమాత్రమే ఇచ్చినట్లు టాక్.  

దీనికితోడు ఈమూవీ మేకింగ్ అంతా వీలైనంత తక్కువలో అవుడ్ డోర్ లోకేషన్లలో తనకు అలవాటైన డిజిటల్ కెమేరాలతో అతితక్కువ నిర్మాణ విలువలతో తీయడంతో ఈమూవీ పై చేసిన ఖర్చు 8కోట్లు దాటదని అంటున్నారు. ‘ఆఫీసర్’ ఫెయిల్ అయినా వర్మకు లాభాన్ని ఇచ్చిన సినిమాగా మారింది అని అంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాకుచెందిన ఒకకొత్త డిస్ట్రిబ్యూటర్ ఈమూవీని ఆంధ్ర ఏరియాకు మూడున్నర కోట్లకు కొన్నారని వార్తలు వస్తున్నాయి. 

8 జిల్లాలు ఉన్న కోస్తా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో నాగార్జున ఫెయిల్యూర్ సినిమాగా గతసంవత్సరం విడుదలై పేరుతెచ్చుకున్న ‘రాజుగారి గది-2’ ఆంధ్ర ఏరియాలో ఏడుకోట్ల వరకు వసూలు చేసిన నేపధ్యంలో అందులో సగం వర్మ నాగార్జునుల ఆఫీసర్ కు కలక్షన్స్ రావా ? అన్న అంచనాలతో ఈమూవీని కొన్నట్లు టాక్. అయితే ఈమూవీకి మొదటిరోజు కలక్షన్స్ 30 లక్షలు వచ్చిన నేపధ్యంలో మూడున్నర కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి అన్న టెన్షన్ తో వర్మను అతడి సహ నిర్మాతను కలవడానికి ప్రయత్నిస్తున్నా స్పందన లేని నేపధ్యంలో ఎదోవిధంగా నాగార్జునను కలిసి తనకు న్యాయం చేసిపెట్టమని నాగ్ పై ఒత్తిడి చేసే ఆలోచనలలో ఈకొత్త డిస్ట్రిబ్యూటర్ ఉన్నట్లు టాక్. ఏమైనా ఆఫీసర్ లాభాలను చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపడుతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: