త్రివిక్రమ్ తో వెంకీ సినిమా ఉంటుందని ఎప్పుడో ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు అది పట్టాలెక్కలేదు. అయితే ఈ ఏడాది కూడా ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లే టట్లు కనిపించడం లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా లో త్రివిక్రమ్ బిజీ గా ఉన్నాడు. ఆ సినిమా అయిపోతే గాని వెంకీ సినిమా మొదలవ్వదు. అయితే త్రివిక్రమ్-వెంకటేశ్ సినిమాకు సంబంధించి హారిక-హాసిని సంస్థ చూచాయగా కొన్ని డేట్స్ ఫిక్స్ చేసింది.

Image result for trivikram and venkatesh

వెంకీతో పాటు సురేష్ బాబు ఒప్పుకుంటే, దాదాపు అవే తేదీలు ఖరారయ్యే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. వెంకీ-త్రివిక్రమ్ సినిమాకు డిసెంబర్ 13న ముహూర్తం షాట్ అనుకుంటున్నారు. అంటే.. ఈ ఏడాది త్రివిక్రమ్-వెంకటేశ్ సినిమా సెట్స్ పైకి రాదన్నమాట. ఇక రెగ్యులర్ షూటింగ్ ను వచ్చే ఏడాది జనవరి నుంచి స్టార్ట్ చేసి, 2019 ఆగస్ట్ లో సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనేది నిర్మాత చినబాబు ప్లాన్. అయితే ఇందులో ఎన్ని మార్పులు జరుగుతాయో ఎవరికీ తెలీదు.

Image result for trivikram and venkatesh

ఇప్పటికే తేజ సినిమాను పక్కనపెట్టాడు వెంకటేష్. అంతకంటే ముందు కిషోర్ తిరుమల ప్రాజెక్టు కూడా రిజెక్ట్ చేశాడు. ప్రకటించి పక్కనపెట్టినవి ఈ రెండే. ఎనౌన్స్ చేయకుండా సైడ్ చేసినవి మరో 2 ఉన్నాయి. సో.. వెంకటేష్ కు త్రివిక్రమ్ ఫుల్ నెరేషన్ ఇవ్వాలి. అది వెంకీతో పాటు సురేష్ బాబుకు నచ్చాలి. అప్పుడు సినిమాకు కొబ్బరికాయ కొడతారన్నమాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: