ఈ మద్య కొంత మంది నటీమణులు చేస్తున్న వ్యవహారాలు ఇండస్ట్రీని తలదించుకునేలా చేస్తున్నాయి.  లగ్జరీ జీవితం కోసం పడుపు వృత్తిని సైతం ఎంచుకోవడంతో సహనటుల పరువు పోయే పరిస్థితి నెలకొంది.  గతంలో పలువురు సీనియర్, జూనియర్ నటీమణులు వ్యభిచారం చేస్తూ అడ్డంగా పోలీసులకు బుక్ అయిన విషయం తెలిసిందే. తాజాగా సెక్స్‌ రాకెట్‌ నడుపుతూ చెన్నయ్‌ పనయూర్‌లోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో తమిళ సీనియర్‌ నటి సంగీత బాలన్‌ అరెస్ట్‌ అయ్యారు.
Vani rani, actress sangeetha balan, prostitution case
ఆ రిసార్టులోకి సంగీత బాలన్‌ పలువురు అమ్మాయిలను తీసుకొచ్చిందంటూ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని తనిఖీలు చేయగా, వారంతా రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఈ కేసులో సురేష్ అనే మరో వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. ఈ వ్యవహారాన్ని ఓ అజ్ఞాత వ్యక్తి పోలీసులకు కాల్ చేసి తెలిపినట్లు సమాచారం. 
tamil actress sangeetha balan arrested in prostitution case
అయితే అప్రమత్తమైన పోలీసులు గట్టి నిఘా పెట్టి రీసార్ట్ లోకి ఎంటర్ అయ్యారు.    ఈ దాడిలో చాలామంది విటులతోపాటు కొంతమంది మహిళా జూనియర్ ఆర్టిస్ట్ లు పట్టుబడ్డారు. నటి సంగీత, ఆమె సన్నిహితుడు సురేశ్‌ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా.. ధర్మాసనం వీరికి కస్టడీ విధించింది.   1996లో వచ్చిన తమిళ సినిమా ‘కరుప్పు రోజా’ ద్వారా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి, ఆ తరవాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించారు. ఆమె టీవీ సీరియళ్లలోనూ నటిస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: