బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్పటి హీరోగానే కాకుండా ఎన్నో సామాజిక సేవాకార్యక్రమాలు చేశారు.  గుప్తదానాలు ఇవ్వడం..ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం ఇలా ఎన్నో చేశారు.  అందుకే సల్మాన్ ఖాన్ కోర్టుకు వెళ్లినపుడు కోట్లలో ప్రజలు స్పందిస్తూ సానుభూతి చూపిస్తున్నారు.  ప్రస్తుతం సల్మాన్ ఖాన్ రేస్3 చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక సీనియర్ నటుడు ధర్మేంద్ర తనయుడు బాబీ ‘బర్సాత్’చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ‘సోల్జర్’ చిత్రంతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. 
Image result for race 3 movie
తన తండ్రి ధర్మేంద్ర, అన్న సన్నీ డియోల్‌లాగా పెద్దగా సక్సెస్ సాధించలేకపోయాడు. దాంతో ఇండస్ట్రీకి దూరం అయ్యాడు..డిప్రేషన్ లోకి వెళ్లిపోయాడు. ఆ సమయంలో సల్మాన్‌ఖాన్, అతని ఫ్యామిలీ తనకు అండగా నిలిచినట్లు బాబీ చెప్పాడు. హీరో అనగానే శరీరాకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అయితే సడెన్‌గా కెరీర్‌లో అన్నీ కోల్పోవడం మొదలైంది. నన్ను నేను తక్కువ చేసి చూసుకున్నాను. ప్రతి రోజూ తాగేవాడిని అని బాబీ డియోల్ చెప్పాడు.

ఒకదశలో అసలు నేను ఏం అవుతున్నానో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. తన కొడుకులు ఆర్యమాన్, ధరమ్ కోసం తాను కచ్చితంగా మారాలని అనుకున్నట్లు అతను తెలిపాడు.  ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటించిన రేస్ 3 చిత్రంలో బాబీడియోల్ నటిస్తున్నాడు. ఈ మూవీ వచ్చే వారం రిలీజ్ కాబోతున్నది. ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో రేస్ 3 లో తనకు ఎలా చాన్స్ వచ్చిందన్న విషయం గురించి చెప్పాడు. సల్మాన్‌తో సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో కలిసినపుడు మాట్లాడాను. ఆ తర్వాత అతనితో రెగ్యులర్‌గా కలుస్తూనే ఉన్నాను..అదే సమయంలో తన పరిస్థితి కూడా చెప్పాను. 
Image result for bobby deol salman khan
ఆ సమయంలో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ..తన కెరీర్ పీక స్టేజ్ లో ఉన్నపుడు సంజయ్ దత్, సన్నిడీయోల్ భుజాలపై కి ఎక్కాను అని సల్మాన్ అన్నాడు.  బహుషా నా పరిస్థితి అర్ధం చేసుకొని ఓ రోజు నాకు ఫోన్ చేసి రేస్ 3 లో నటిస్గున్నావ్ అని చెప్పాడు. రేస్ 3 తర్వాత బాబీ డియోల్ హౌజ్‌ఫుల్ 4లో కనిపించనున్నాడు. ఆ తర్వాత యమ్‌లా పగ్‌లా దీవానా ఫిర్ సె మూవీలో అన్న సన్నీ డియోల్, తండ్రి ధర్మేంద్రతో కలిసి నటించనున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: