తెలుగు ఇండస్ట్రీలో ‘శివ’ చిత్రంతో రాంగోపాల్ వర్మ, అక్కినేని నాగార్జున్ ఒక ట్రెండ్ సృష్టించిన విషయం తెలిసిందే.  ఒక రకంగా చెప్పాలంటే..విలనీజానికి కొత్త భాష్యం చెప్పారని అంటారు.  విరిద్దరి కాంబినేషన్ లో తర్వాత గోవింద గోవింద, అంతం లాంటి చిత్రాలు వచ్చాయి..కానీ పెద్దగా సక్సెస్ కాలేదు. చాలా సంవత్సరాల తర్వాత వర్మ, నాగ్ కాంబినేషన్ లో ‘ఆఫీసర్’ చిత్రం రిలీజ్ అయ్యింది.  ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు పెట్టుకుంటూ వచ్చారు చిత్ర యూనిట్.  అంతే కాదు స్వంగా రాంగోపాల్ వర్మ, నాగార్జున్ లు కూడా విపరీతంగా ప్రమోట్ చేశారు. 
Officer Box office collections report
తీరా థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత అంచనాలు తలకిందులయ్యాయి.  వర్మ మరోసారి మాఫియా ఫార్మాట్ నే నమ్ముకున్నారని..చిత్రంలోకొత్తదనం లేదని పెదవి విరిచారు ప్రేక్షకులు. గత శుక్రవారం మన ముందుకు వచ్చిన నాగార్జున.. ఇప్పుడు సడెన్ గా వేదాంతంలోకి దిగిపోయారు. రిలీజ్ రోజున పట్టుమని 50 లక్షల షేర్ కూడా రాబట్టలేకపోయిన రాంగోపాల్ వర్మ సినిమా.. రెండో రోజుకే డెఫిషిట్ లోకి వచ్చేసింది.
Image result for nagarjuna varma
అంటే రెండో రోజుకే ఒక్క రూపాయి షేర్ కూడా ప్రొడ్యూసర్ కు.. పంపిణీ చేసిన వారికి ఇవ్వలేకపోయిందన్న మాట.  తాజాగా ఈ విషయంపై నాగ్ స్పందిస్తూ..'గుడ్ మాణింగ్.. వారం గడిచిపోయి మళ్లీ సోమవారం వచ్చింది. "విజయం అనేదే అంతిమం కాదు.. పరాజయం భయానకం కాదు.. ఏం జరిగినా కొనసాగడమే  మనిషి స్థైరాన్ని చాటుతుంది" అని విన్ స్టన్ చర్చిల్ అన్నారు. అందుకే చిరునవ్వుతో నా ప్రయాణం కొనసాగిస్తాను. హావ్ ఏ గ్రేట్ డే' అంటూ నాగ్ వేదాంతంతో కూడిన ట్వీట్ పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: