బిగ్ బాస్ మొదటి సీజన్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేశాడు. రియాలిటీ షోలో సరికొత్త సంచలనాలు సృష్టించిన బిగ్ బాస్ మొదటి సీజన్ సూపర్ సక్సెస్ అవగా ఇప్పుడు సెకండ్ సీజన్ కు రెడీ అవుతుంది. జూన్ 10 నుండి బిగ్ బాస్-2 స్టార్ మాలో ప్రసారమవుతుంది. ఈసారి నాని ఈ షోకి హోస్ట్ గా ఉంటున్నాడు.


ఇక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నాని మాట్లాడుతూ బిగ్ బాస్ తాను చూడలేదని.. తారక్ అద్భుతంగా చేశాడని తెలుసుకుని కొన్ని ఎపిసోడ్స్ చూశానని అన్నారు. ఇక మొదటి సీజన్ తారక్ సక్సెస్ చేశాడు. ఇక ఇప్పుడు ఆ బాధ్యత తన మీద ఉందని.. కచ్చితంగా బిగ్ బాస్-3 అప్పుడు ఇది కూడా ఓ బెంచ్ మార్క్ గా ఉంటుందని అన్నారు.


ఓ రకంగా ఎన్.టి.ఆర్ కు నాని ఛాలెంజ్ చేసినట్టే అని కొందరు అంటున్నారు. ఎన్.టి.ఆర్ రేంజ్ స్టార్ ఇమేజ్ లేకున్నా నాచురల్ స్టార్ గా నానికి ఆడియెన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక ఈసారి స్టార్ సెలబ్రిటీస్ కూడా బిగ్ బాస్ కంటెస్టంట్స్ గా ఉంటున్నారు కాబట్టి కచ్చితంగా ఈ సీజన్ మొదటి సీజన్ కన్నా సూపర్ సక్సెస్ అవుతుందని అంటున్నారు.


100 రోజుల పాటు సాగనున్న ఈ సీజన్ 16 మంది సెలబ్రిటీస్ బిగ్ బాస్ హౌజ్ లో ఉండనున్నారు. ఈసారి ఓ కామన్ మ్యాన్ కు బిగ్ బాస్ కంటెస్టంట్ గా ఉండే అవకాశం ఇచ్చారు. ఈసారి షోని కాస్త సపిసీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అందుకే ప్రోమోలోనే మరింత మసాలా అంటూ నాని చెప్పుకొచ్చాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: