ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ..ఆ తర్వాత పెళ్లిచూపులు సినిమతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.  సందీప్ వంగ దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓ రేంజ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు.  ఈ మద్య రిలీజ్ అయిన ‘మహానటి’ సినిమాలో సమంతతో కలిసి నటించిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘టాక్సీవాలా’సినిమాలో నటించాడు.  అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. 
Image result for vijay devarakonda taxiwala
ఇక రిలీజ్ తరువాయి అనుకుంటున్న సమయంలో వాయిదా పడుతూ వస్తుంది. ప్రస్తుతం ఈ విజయ్  టాక్సీవాలా పై ఎక్కువ దృష్టి పెట్టాడు. అంతే కాదు  ఈ సారి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్లాన్ చేసుకున్నాడు. హారర్ మరియు మంచి కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న ఆ సినిమాలో విజయ్ ఒక టాక్సీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. వాస్తవానికి ఈ సినిమా మే 14న రిలీజ్ అవ్వాలి.
Related image
సినిమా మొదలయినప్పటి నుంచి అదే డేట్ కి సినిమా రానుందని చెప్పారు. ఇక తీరా ఆ సమయం వచ్చే సరికి జూన్ 14న వస్తున్నట్లు విజయ్ చెప్పాడు. ఇక ఇదే ఫైనల్ అనుకున్నప్పటికి ఇప్పుడు ఆ డేట్ కి కూడా టాక్సీ వాలా రావడం లేదనే టాక్ వస్తోంది. దీనికి కారణం ఈ సినిమాలో సన్నివేశాలకు తగ్గట్లు మళ్లీ రీ షూట్ చేస్తున్నట్లు సమాచారం..అంతే కాకుండా  విజువల్ ఎఫెక్ట్స్ మరికొంత మెరుగు పరుస్తున్నారట.

ఆ పనులు ఆలస్యం అయినందువల్ల సినిమాను జులై కి పోస్ట్ ఫోన్ చేసినట్లు సమాచారం. త్వరలోనే చిత్ర యూనిట్ ఈ విషయంలో ఒక క్లారిటీ ఇవ్వనుంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ అండ్ గ్యాంగ్ నిర్మిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: