సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన కాలా సినిమా కర్ణాటకలో విడుదల చెయ్యరాదని గత వారం రోజుల నుంచి కర్ణాటకలో ఆందోళనలు చేస్తున్నారు. దీనిపై వివిధ సినిమా ఇండస్ట్రీల నుంచి తీవ్ర వ్యతిరేఖత వస్తుంది.  సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా  పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కాలా’. లైకా ప్రొడక్షన్స్, వండర్‌బార్స్ నిర్మాణ సంస్థలు ఈ సినిమాను నిర్మించాయి. ముంబై దారావి ప్రాంతానికి చెందిన మాఫియా డాన్ పాత్రలో రజనీకాంత్ కనిపిస్తున్నారు.
రంగంలోకి రజనీ ఫ్యాన్స్
హ్యుమా ఖురేషి, ఈశ్వరీరావులు రజనీకాంత్ సరసన నటించారు. బాలీవుడ్ నటుడు నానా పటేకర్ ఇందులో విలన్‌గా కనిపించనున్నారు. రజనీకాంత్ హీరోగా నటించిన కాలా సినిమా వచ్చే వారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల చెయ్యడానికి సర్వం సిద్దం చేశారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యే కాలా సినిమాను కేవలం కర్ణాటకలో అడ్డుకోవడం సరికాదని, రజనీకాంత్ ను నటుడిగా మాత్రమే చూడాలని ఆయన అభిమానులు కన్నడిగులకు మనవి చేస్తున్నారు. 
రజనీకాంత్ కన్నడ ద్రోహి
తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిపికేట్‌ను పొందింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాను జూన్ 7న విడుదల చేయబోతున్నారు. త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయనున్న రజనీకాంత్ అంత కంటే ముందుగానే కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: