గత కొంత కాలంగా తమిళనాడు, కర్ణాటకలో కావేరీ జలాల వివాదం ఏ రేంజ్ లో కొనసాగుతుందో అందరికీ తెలిసిందే.  అయితే ఇది మొన్నటి వరకు రాజకీయాంగానే ఉండేది..కానీ ఈ మద్య కావేరీ జలాల వివాదం రాను రాను సినిమాలపై కూడా పడుతుంది. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన 'కాలా' ఈనెల 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధవుతోంది. అయితే కావేరీ గొడవలు, దానిపై రజనీ స్పందనను దృష్టిలో ఉంచుకుని కర్ణాటకలో 'కాలా' విడుదలను అడ్డుకుంటామంటూ కన్నడ అనుకూలవాదులు ప్రకటించారు. 
Image result for ‘కాలా’
తాజాగా దీనిపై స్పందించిన విలక్షణ నటులు ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ..ఇది చాలా దారుణం అని..ప్రపంచంలో కళలకు ఎంతో ప్రాధాన్య ఇచ్చే వారు ఉన్నారని..ముఖ్యంగా అభిమానులపై సినిమా ప్రభావం ఎంతో ఉంటుంది..అలాంది సినిమాలకు, రాజకీయాలకు పొంతన పెట్టడం చాలా అన్యాయం అని అన్నారు.  ఆ మాటకుల వస్తే.. సినిమాలకూ, రాజకీయాలకూ సంబంధం ఉండకూడదన్నారు.

'కాలా'పై నిషేధం తాము కోరలేదని కర్ణాటక ఫిల్మ్ చాంబర్ చెబుతోందని, అయితే సినిమా విడుదల ద్వారా ఉద్రిక్తతలకు తావీయరాదని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్టు కనిపిస్తోందని ఆయన అన్నారు. ఈమేరకు వారిపై ఒత్తిడి కూడా కనిపిస్తోందన్నారు. ఈ మద్య బాలీవుడ్ లో కూడా ‘పద్మావత్’ సినిమాపై రాజకీయ రంగు పులిమారు..కానీ విడుదల అయిన తర్వాత ఎవరి మనోభావాలు దెబ్బతీయలేదన్న నగ్న సత్యాన్ని గమనించారు.  అయితే  సినిమా కావచ్చు, ఆర్ట్ వర్క్ కావచ్చు...ప్రజలకు ఇవి 'సాఫ్ట్ టార్గెట్' కావడం సరైంది కాదు.

అది 'పద్మావతి' అయినా 'కాలా' అయినా సమస్య సజీవంగానే ఉండిపోతే సహజంగానే రెచ్చగొట్టే శక్తులు కొన్ని చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటాయి. అలాంటి వాళ్లకు ప్రభుత్వం చాలా స్పష్టంగా శాంతిభద్రతల బాధ్యత తమదేనని చెప్పాల్సి ఉంటుందని అన్నారు ప్రకాశ్ రాజ్. ప్రస్తుతం 'కాలా' విడుదల విషయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపైనే ఉంది' అని ప్రకాష్‌రాజ్ అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: