ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే సౌత్ ఇండియాలో సినిమా అభిమానుల‌కే పూన‌కాలే. మిగిలిన హీరోల అభిమానులు సైతం ర‌జ‌నీకి వీరాభిమానులే. ర‌జ‌నీ సినిమా అంటే ఎలాంటి పండ‌గ వాతావ‌ర‌ణం ఉంటుందో మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే రోబో త‌ర్వాత ర‌జ‌నీ గ్రాఫ్ రోజు రోజుకు కింద ప‌డుతూ పాతాళానికి ప‌డిపోయింది. రోబో త‌ర్వాత ఆయ‌న సినిమాల‌న్నీ స‌గ‌టు సినీ అభిమానినే కాకుండా, ర‌జ‌నీ వీరాభిమానుల‌ను సైతం డిజ‌ప్పాయింట్ చేశాయి.

Image result for kaala movie

కొచ్చాడ‌య‌న్ (తెలుగులో  విక్ర‌మ‌సింహుడు) - లింగా - క‌బాలి మూడు సినిమాలు డిజాస్ట‌ర్లే. ఈ మూడు సినిమాలు ర‌జ‌నీ కెరీర్ చివ‌రి ద‌శ‌లో ఆయ‌న‌కు పెద్ద మ‌చ్చ తెచ్చాయి. క‌బాలి ద‌ర్శ‌కుడే ఇప్పుడు కాలాకు ద‌ర్శ‌కుడు కావ‌డం లైన్ కూడా కాస్త అటూ ఇటూగా క‌బాలినే పోలీ ఉండ‌డంతో కాలాకు మార్కెట్ జ‌ర‌గ‌డం లేదు. కాలా తెలుగు రైట్స్ ఇంకా సేల్ కాలేదు. 

Image result for kaala movie

కాలా సినిమా తెలుగు థియేటర్ హక్కుల బేరం 60 కోట్ల దగ్గర ప్రారంభమైంది. లైకా వాళ్లు ఈ రేటు చెప్ప‌గానే ఎవ్వ‌రూ కొన‌లేదు. దీంతో రూ.40కు దిగారు... అయినా ఎవ్వ‌రూ ముందుకు క‌ద‌ల్లేదు. ఇప్పుడు చివ‌ర‌కు రూ.20 కోట్లు మాత్ర‌మే ఇవ్వ‌మ‌ని అంటున్నా అక్క‌డ కూడా ఊగిస‌లాట‌లే ఉన్నాయి. చివ‌ర‌కు చేసేదేం లేక లైకా వాళ్లు ఓన్ రిలీజ్‌కు వెళ్లిపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: